జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలలో మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే. రెండు నియోజక వర్గాలు భీమవరం మరియు గాజువాక నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్...కచ్చితంగా ఈ ఎన్నికలలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని పార్టీ ప్రచార కార్యక్రమాలలో జనసేన పార్టీ కార్యకర్తలకు ఉత్సాహాన్నిచ్చే మాటలు చెబుతున్నారు.

Image result for ram charan pawan kalyan

ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవల ఓ ప్రముఖ చానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన పవన్ కళ్యాణ్..సినిమా కుటుంబ నేపథ్యం కాబట్టి జనసేన పార్టీ తరపున మీ కుటుంబం నుండి ముఖ్యంగా రామ్ చరణ్ ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయా అని విలేఖరి ప్రశ్నించగా..దానికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ.. ‘నేను నా స్టార్ డమ్‌ వాడుకోను, స్టార్ డమ్ అనేది జనాలు రావడానికి తప్ప ప్రజలను చైతన్యం చేయడానికి పని చేయదు.

Related image

అలాంటపుడు రామ్ చరణ్ స్టార్ డమ్ నేనెలా వాడుకుంటాను. నేను నా పొలిటికల్ ఐడియాలజీనే నమ్ముకుని ముందుకు సాగుతాను' అని పవన్ కళ్యాణ్ తేల్చేశారు. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న రామ్ చరణ్ పై ఒత్తిడి తీసుకు వచ్చే ఉద్దేశం తనకు లేదని అన్నారు. గతంలోనే ఒకానొక సందర్భంలో బాబాయి అడిగితే తప్పకుండా ప్రచారం చేస్తాను అని చెర్రీ అన్నాడని..కానీ చెర్రీపై ఒత్తిడి పెట్టడం నాకు ఇష్టం లేదని నా ఆలోచనలు వేరు..ఆ దారిలో నేను ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: