ఇప్పటి వరకు వెండితెర, బుల్లితెరపై మహాభారతం సినిమాలు, సీరియళ్లు ఎన్నో వచ్చాయి.  భారతీయుల ప్రాచీన ,పురాణ గ్రంధాలలో మహాభారతం ఒకటి ,తింటే గారలే తినాలి వింటే భారతమే వినాలి అనే నానుడి కూడా మనకి తెలిసిందే.  మహాభారతం ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది.  ప్రముఖ రచయిత ఎమ్.టి.వాసుదేవన్ నాయర్ రాసిన 'రాండ మూజమ్' నవల ఆధారంగా, 'మహాభారతం' సినిమాను నిర్మించాలని పారిశ్రామికవేత్త బీఆర్ శెట్టి భావించారు. ఈ ప్రాజెక్టు కోసం ఆయన దర్శకుడిగా శ్రీకుమార్ మీనన్ ను ఎంపిక చేసుకున్నారు.


రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా కనీ వినీ ఎరుగని రీతిలో  రూపొందించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ సినిమాను మహాభారతంలో పద్దెనిమిది పర్వాలను రెండు భాగాలుగా మలయాళంతో పాటు కన్నడ, తెలుగు, హిందీతో పాటు వందకు పైగా విదేశీ భాషల్లో తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ఐతే ఈ సినిమా తెరకెక్కించే విషయంలో దర్శకుడికి,రచయతకు మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఈ సినిమా నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు నిర్మాత బీఆర్ శెట్టి ప్రకటించారు.


ఇక భీముడి పాత్ర కోసం మోహన్ లాల్ ను తీసుకున్నట్టుగా ప్రచారం కూడా జరిగింది. దర్శక నిర్మాతల మధ్య వచ్చిన మస్పర్ధల కారణంగా..ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు లేదనేది తాజా సమాచారం. తాజాగా బీఆర్ శెట్టి స్పందిస్తూ .. "శ్రీకుమార్ మీనన్ తో విభేదాలు తలెత్తాయి. మంచి రచయిత .. దర్శకుల కోసం అన్వేషణ సాగుతోంది. ఆలస్యమైనా ఈ సినిమాను తప్పకుండా నిర్మించి తీరుతాను" అని ఆయన చెప్పుకొచ్చారు.   


శ్రీ కుమార్ మీనన్ చివరిగా మోహన్ లాల్ తో ఓడియన్ అనే సినిమాని తెరకెక్కించారు. ఇది కాస్తా ఫ్లాప్ అయ్యింది. ఈ కారణంగానే నిర్మాత ఈ ప్రాజెక్ట్ ని పక్కకి తప్పుకున్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: