టాలీవుడ్ లో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో ఖైదీ తర్వాత ఆ రేంజ్ లో హిట్ అయిన మూవీ ‘రాక్షసుడు’.  ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబు కూడా ముఖ్య పాత్రలో కనిపించాడు.  చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ‘రాక్షసుడు’ఒకటి.  ఈ మద్య మెగా ఫ్యామిలీ నుంచి కొంత మంది హీరోలు వస్తున్న నేపథ్యంలో చిరంజీవి హిట్ సినిమా నుంచి పాటలు రిమేక్ చేస్తున్నారు.  ఇక అల్లుడు శీను సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లం కొండ శ్రీనివాస్. 

డ్యాన్స్, ఫైట్స్, నటన అన్నింటా మంచి పేరు సంపాదించిన బెల్లంకొండ శ్రీనుకి సరైన హిట్స్ లేక సతమతమవుతున్నాడు.  ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం 'సీత' సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు కోలివుడ్  మూవీ 'రాచ్చసన్' రీమేక్ సినిమాలో నటించడానికి అంతా సిద్ధం చేస్తున్నాడు.  రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్  యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు.

తమిళంలో గత ఏడాది హిట్ కొట్టిన 'రాచ్చసన్' సినిమాకి ఇది రీమేక్. తమిళంలో విష్ణు విశాల్ .. అమలా పాల్ జంటగా నటించిన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది.  ఆ మద్య సూర్య కూడా ఇదే టైటిల్ వాడుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బెల్లంకొండ శ్రీనివాస్ తన సినిమా కోసం వాడుకుంటున్నాడు. శనివారం నాడు ఉగాది పండగ కానుకగా సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తారు. సినిమా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: