నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ తన ఇమేజ్ ని మరింత పెంచుకోవడానికి 'సాహో' కోసం విపరీతంగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈమూవీలోని యాక్షన్ సీన్స్ ను హాలీవుడ్ సినిమాల స్థాయిలో చూపించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో కేవలం ఈమూవీలోని యాక్షన్ సీన్స్ కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.  

ముఖ్యంగా ఈమూవీలో ప్రభాస్ చేసే యాక్షన్ సీన్స్ కోసం ట్రింప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ అనే బైక్ను ఉపయోగించారు. దుబాయ్లో గతేడాది చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్ సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ బైక్ గురించి ఒక ఆశక్తికర కథనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 

హాలీవుడ్ సినిమాలలో ఛేజింగ్ సీక్వెన్స్ లో విపరీతంగా వాడే బైక్ ట్రింప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్. తాజాగా అనేక సాంకేతిక మార్పులతో ఈ బైక్ను మార్కెట్ లోకి తెచ్చారు. 765 సీసీ లైన్ త్రీ సిలెండర్ ఇంజిన్ ద్వారా ఈ బైక్కు పవర్ సప్లై అవుతుంది. 121 బీహెచ్పీతో 11700 ఆర్పీఎం, 77ఎన్ఎం పీక్ టార్క్తో పాటు  10800 ఆర్పీఎం దీని ప్రత్యేకత. ఇప్పుడు ఈ బైక్ ప్రత్యేకతలు అందరికీ తెలియడంతో ఈ బైక్ ఖరీదు గురించి ప్రభాస్ అభిమానులు గూగుల్ సర్చ్ లో తెగ వెతకడంతో ఈ బైక్ కు సంబంధించిన ధర కూడా బయటకు వచ్చింది. 

ప్రభాస్ వాడిన ట్రింప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్ ధర సుమారు 10.55 లక్షలు ఉంటుంది అని వస్తున్న వార్తలు ప్రభాస్ అభిమానుల మధ్య హాట్ న్యూస్ గా మారింది. సాధారణంగా ఇలాంటి ఖరీదైన బైక్ లను బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలలో మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రభాస్ కూడ అలాంటి ఖరీదైన బైక్ ను వాడటంతో ప్రభాస్ 'సాహు' లో వాడిన బైక్ ఫోటోలు దానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు అభిమానుల మధ్య ట్రెండింగ్ న్యూస్ గా మారింది..    



మరింత సమాచారం తెలుసుకోండి: