రేపు విడుదల కాబోతున్న మజిలీ సినిమాను ప్రమోట్ చేస్తూ నాగచైతన్య అనేక పత్రికలకు అదేవిధంగా అనేక ఛానల్స్ లో సమంతతో కలిసి ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ బిజీగా ఉన్నారు. ఈసినిమా విజయం పై పూర్తి నమ్మకంతో ఉన్న వీరిద్దరూ ఈసినిమా క్లైమాక్స్ కోసం చేసిన హోమ్ వర్క్ ను వివరించారు. 

ఈమూవీ క్లైమాస్ సీన్ చాల ఎమోషనల్ గా ఉండటమే కాకుండా చాల సహజంగా ఉంటుందని వివరిస్తూ చైతన్య ఈమూవీ కోసం కొద్దిరోజులపాటు ప్రతి చిన్న విషయానికీ నిజ జీవితంలో కూడ తగువులు పడుతూ సహజత్వం కోసం తమ ముఖ కవళికలలో కనబడటానికి తాము పడ్డ పాట్లను వివరించాడు చైతన్య. ముఖ్యంగా ఈ సినిమాలో భార్య భర్తలుగా నటిస్తున్న తామిద్దరం ఈ మూవీలోని పాత్రల స్వభావం రీత్యా ప్రతి చిన్న విషయానికి ఇగో ఫీల్ అయి తామిద్దరం చాల గొడవలు పడుతూ ఎమోషనల్ గా నటించవలసిన సందర్భంలో తనలో ఇప్పటి వరకు చూడని మరొక కోణాన్ని తాను సమంతకు చూపించాను అంటూ జోక్ చేసాడు చైతన్య.

ఒక ఉదాతమైన కథను శివ నిర్మాణ తీర్చిదిద్దిన తీరు ఈ మూవీకి హైలెట్ గా మారుతుంది అని సంకేతాలు ఇస్తూ ఈ మూవీ పై అంచనాలు పెంచుతున్న చైతన్య మాటలలో ఆత్మస్థైర్యం బాగా కనిపిస్తోంది. అయితే విపరీతంగా ఎమోషనల్ సీన్స్ ఉండే క్లైమాక్స్ ను సగటు ప్రేక్షకులు ఆదరించారు అన్న ఇండస్ట్రీ సెంటిమెంట్ కూడ ఉంది. 

ఇలాంటి పరిస్థుతులలో ఈ ప్రయోగం ఎంతవరకు విజయవంతం అవుతుంది అన్న విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లకు ఏర్పడిన క్రేజ్ ను బట్టి ఈ మూవీ ఓపెనింగ్స్ విషయంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇలాంటి సీరియస్ మూవీని ఎంతవరకు ప్రేక్షకులు ఆదరిస్తారో అన్నది రేపటి వరకు వేచి చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: