అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నిన్నుకోరి సినిమాతో సత్తా చాటిన శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన సినిమా మజిలీ. లవ్ అండ్ ఎమోషన్ కలిసి వచ్చిన ఈరోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుండగా ఓవర్సీస్ ప్రీమియర్స్ నుండి సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తుంది. ముఖ్యంగా సినిమాలో చైతు నటన గురించి అందరు మాట్లాడుతున్నారు.


నాగ చైతన్య పూర్ణ పాత్రలో కనిపించగా.. సమంత శ్రావణిగా నటించింది. యుక్తవయసులో క్రికెట్, లవ్ రెండిటిని ఎక్కువగా ప్రేమించి ఆ రెండిటిని మిస్సైన పూర్ణ లైఫ్ లోకి శ్రావణి వస్తుంది. అప్పుడు ఏం జరిగింది అన్నది సినిమా కథ. సినిమాకు ముందునుండి పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఆల్రెడీ నిన్నుకోరితో శివ నిర్వాణ మంచి విజయాన్ని అందుకున్నాడు.


మజిలీ సినిమా చూసిన అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ సినిమాలో చైతు, సమంతలు నటించలేదు జీవిచేశారని అన్నాడు. తమ పాత్రలకు ప్రాణం పోశారని చెప్పుకొచ్చాడు. అందమైన సున్నితమైన ప్రేమ కథను శివ నిర్వాణ చాలా బాగా తీశాడని అన్నారు. లవ్ అండ్ పెయిన్ చాలా బాగుందని. గోపి సుందర్ పాటలు.. తమన్ బిజిఎం బాగుందని అన్నారు.


ఈ సినిమా చూడటం ఓ బ్యూటిఫుల్ ఎక్స్ పీరియన్స్ అని ట్వీట్ చేశాడు సుశాంత్. చూస్తుంటే నాగ చైతన్య, సమంత కలిసి మరోసారి మాయ చేసేలా ఉన్నారనిపిస్తుంద్. సినిమాలో మరో హీరోయిన్ గా నటించిన దివ్యాన్ష కౌశిక్ కూడా మొదటి సినిమానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిందని అన్నారు సుశాంత్. మరి సుశాంత్ చెప్పినట్టుగా సినిమా ఆ రేంజ్ లో ఉందా లేదా అన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: