కరెక్ట్ సినిమా పడాలే కాని నటుడిగా తన సత్తా చాటాలని చూస్తున్న అక్కినేని వారసుడు నాగ చైతన్యకు ఇన్నాళ్లకు తనకు సరిపోయే, తన టాలెంట్ చూపించే పాత్ర దొరికిందని చెప్పొచ్చు. అలానే హీరోగా ఎంట్రీ ఇచ్చి దశాబ్ధ కాలం కావొస్తున్న అక్కినేని వారసుడు నాగ చైతన్యకు ఇన్నాళ్లకు తనకు పర్ఫెక్ట్ అనిపించే పాత్ర పడ్డది. 


జోష్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఆ సినిమాలో నటన సోసోగా ఉన్నా కుర్రాడిని సాన బెడితే బాగానే ఉంటుందని అనుకున్నారు. తండ్రి బాటలో రొమాంటిక్ హీరోగా, లవర్ బోయ్ ఇమేజ్ తో సరిపెట్టుకున్నాడు నాగ చైతన్య. అయితే కెరియర్ లో హిట్లు ఉన్నా నటుడిగా చైతుకి సంతృప్తి లభించిన సినిమా అంటే మజిలీ అని చెప్పొచ్చు.  


మజిలీ సినిమాలో పూర్ణ పాత్రలో నాగ చైతన్య తన పరిధిని మించి చేశాడు. ఆ పాత్ర చైతు నటించాడు అని చెప్పడం కంటే జీవించాడని చెప్పొచ్చు. రాం చరణ్ కు రంగస్థలం సినిమా ఎంత మంచి పేరు తెచ్చిందో.. నాగ చైతన్య మజిలీ అంత మంచి పేరు తెస్తుందని అంటున్నారు. చైతుకి సపోర్ట్ గా సమంత కూడా తన నటనతో మెప్పించిందని తెలుస్తుంది. 


మజిలీ మనసులు గెలిచేలా మలిచాడట దర్శకుడు శివ నిర్వాణ. గోపి సుందర్ మ్యూజిక్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యిందట. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఉంటూనే భార్య భర్తల మధ్య అనుబంధాన్ని చక్కగా చూపించాడట దర్శకుడు. నిన్నుకోరితో హిట్ అందుకున్న ఈ యువ దర్శకుడు మజిలీతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నట్టే అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: