సినిమా ఇండస్ట్రీలో హీరోలా కూతుర్లు కూడా రాణిస్తున్నారు. ఈ ట్రెండు బాలీవుడ్ లో ఇంకా ఎక్కువని చెప్పాలి. అయితే అయితే వీరి అందాల ప్రదర్శన కూడా హద్దులు దాటిపోయింది. ఇలా అందాలు మితిమీరి పోవటంతో అందరికి దిశా పటాని గుర్తుకు వస్తుంది. ఫ్యాషన్ పేరుతో, ప్రమోషన్స్ కోసమంటూ స్టైలిష్ లుక్ పేరుతో అర్ధ నగ్నమైన పోజులు ఇవ్వడంలో ఫేమస్ అయ్యింది దిశాపటానీ. హీరోయిన్లు తమ గ్లామర్ ను పొదుపైన దుస్తుల్లో ప్రదర్శించడం కొత్త ఏమీకాదు. అయితే ఆ విషయంలో దిశాపటానీ కొత్త పుంతలు తొక్కింది.


పదే పదే హాట్ హాట్ ఫొటోస్ ను ప్రదర్శిస్తూ వచ్చింది. అంతేగాక ఒక లోదుస్తుల బ్రాండ్ తో ఒప్పందం కుదర్చుకుని దుమ్మురేపుతూ వచ్చింది దిశాపటానీ. ఇన్ స్టాగ్రమ్ లో భారీ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న దిశాపటానీ అలా ఫొటోలు పోస్టుచేస్తూ వస్తోంది. అయితే అలాంటి హీరోయిన్ గ్లామరస్ ఫొటోలు ఎన్నిపెట్టినా చూసేవాళ్లకు తనివి తీరదు కాబట్టి.. ఆ విషయంలో ఆమెను బోర్ గా ఫీల్ కావడంలేదు. అయితే ఇప్పుడు నెటిజన్లు సారా అలీఖాన్ కు ఒక విలువైన సూచన చేస్తున్నారు.


అదేమిటంటే.. మరో దిశాపటానీ కావొద్దు అని! ఇప్పటికే రెండు సినిమాల్లో నటించిన సైఫ్ అలీఖాన్ కూతురు ఇప్పుడు హాట్ హాట్ పోజులు ఇస్తోంది. మరి ఈ చిన్న పిల్లకు అలా చేసేస్తుంటే.. కాస్త తగ్గమని మరీ అలా ఆరేసుకోవద్దని..  చెబుతున్నారు. ఒకే మాటతో.. మరో దిశాపటానీ కావొద్దు అని.. అని సూచిస్తున్నారు! మరి సారా ఆ విషయాన్ని అర్థం చేసుకుంటుందా!

మరింత సమాచారం తెలుసుకోండి: