రాజమౌళి సినిమాలలో నటించాలని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ సెలెబ్రెటీలు అంతా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థుతులలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి తనకు అనుకోకుండా చేసిన అన్యాయంకు సంబంధించిన విషయాన్ని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీలో ఎన్టీఆర్ పాత్రను పోషించిన విజయ్ కుమార్ బయటపెట్టాడు. 

రాజమౌళి జూనియర్ తో ‘యమదొంగ’ సినిమాను తీసే రోజులలో తనకు రాజమౌళి ఆఫీసు నుండి పిలుపు వచ్చిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు. వాస్తవానికి ఆమూవీలో జూనియర్ పాత్ర చనిపోయి స్వర్గానికి వెళ్ళినప్పుడు ‘మనవడా ఎప్పుడు వచ్చావు’ అంటూ పలకరించే పాత్ర తనది అని చెప్పి ఆతరువాత తన మీద షూట్ చేసిన సీన్ తీసివేసి ఎన్టీఆర్ గ్రాఫిక్ తో డిజైన్ చేసిన విషయాన్ని బయటపెట్టాడు విజయ్ కుమార్. 

దీనితో తాను రాజమౌళి టీమ్ ను తనను ఎందుకు పిలిపించారు అని అడిగినప్పుడు కేవలం తన నీడ షూట్ చేయడానికి పిలిపించినట్లు చెప్పి తనకు షాక్ ఇచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. దీనితో తనకు చాల అసహనం కలిగింది అని చెపుతూ ఆతరువాత మరొకసారి రాజమౌళి ఆఫీసు నుండి వేరే సినిమాకోసం ఒక పాత్ర ఉంది అని ఫోన్ వస్తే తాను నాటకాలలో బిజీగా ఉన్నాను అని చెప్పి సమాధానం ఇచ్చిన సంఘటనను విజయ్ కుమార్ ఇప్పుడు బయట పెట్టాడు. 

4,500 నాటకాలలో నటించిన విజయ్ కుమార్ ఇప్పటి వరకు 150 పౌరాణిక పాత్రలలో కూడ నటించాడు. అయితే తన జీవితంలో ఎప్పుడు ఎన్టీఆర్ పాత్రలో నటిస్తాను అని తన కలలో కూడ అనుకోలేదు అని అంటున్నాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లో తనకు ఇంత పేరు రావడంతో కొంతమంది దర్శకుల నుండి తనకు ఆడిషన్స్ కు రమ్మని ఫోన్స్ వస్తున్నాయని అయితే తన ఫోటోలు పుచ్చుకుని తాను నటించిన వీడియో క్యాసెట్లు పుచ్చుకుని తనకు అవకాశాలు ఇమ్మని దర్శకులు చుట్టూ తిరగే ఓపిక తనకు లేదు అంటూ తనను గుర్తించిన నాటక రంగాన్ని జీవితాంతం వదలను అని చెపుతున్నాడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లోని విజయ్ కుమార్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: