నాగార్జున తన పిల్లల విషయంలో టెన్షన్ పడుతున్న పరిస్థుతులకు పరిష్కారం దొరికింది. ఎట్టకేలకు చైతన్య కోరుకున్న హిట్ ‘మజిలీ’ ఓవర్సీస్ టాక్ లో వినిపిస్తోంది. అమెరికాలో ఈమూవీ ప్రీమియర్ షోలను చూసిన ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం ‘మజిలీ’ సూపర్ హిట్ టాక్ వైపు అడుగులు వేస్తోందా అన్న సంకేతాలు వస్తున్నాయి.  

మణిరత్నం లాంటి స్థాయి ఉన్న దర్శకుడుగా శివ నిర్మాణ మారిపోతాడు అంటూ ఇప్పటికే చూసిన కొందరు ఓవర్సీస్ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. నాగచైతన్య యాక్టింగ్ స్కిల్స్ లో పూర్తి పరిపక్వత వచ్చిందని చైతు తన నటనతో మాయ చేసిన మూవీ ‘మజిలీ’ అంటూ ఓవర్సీస్ ప్రేక్షకుల నుండి ప్రశంసలు వస్తున్నాయి. 


మరికొందరైతే ఈసినిమా ద్వారా చైతన్య తన నటన విషయంలో సమంతను డామినేట్ చేసాడనీ ఈమూవీ క్లైమాక్స్ సీన్స్ చూసిన ప్రతివారు కనెక్ట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. ఈమూవీ మ్యూజిక్ అద్భుతం అంటూ ఏకంగా చాలామంది 3.5/5 రేటింగ్స్ ఇస్తున్నారు. కథ విషయంలో వెరైటీ ఈమూవీని నిలబెడుతుంది అంటూ మరికొందరు ఓవర్సీస్ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. 

అంతేకాదు ఈమూవీ అందరు చూడదగ్గ సినిమా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈమూవీ ఫీల్ గుడ్ మూవీగా మారుతుందనీ ఓవర్సీస్ ప్రేక్షకులు కురిపిస్తున్న ప్రశంసలతో  ఈమూవీని సూపర్ హిట్ రేంజ్ కి వెళ్ళిపోవడం ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనితో ఈమూవీలో సమంత పై నటన విషయంలో చైతూకు ఎక్కువ మార్కులు పడినట్లు తెలుస్తోంది. దీనితో నాగార్జున ఫ్యామిలీ ఫుల్ జోష్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈమూవీకి ఇచ్చే టాక్ ను బట్టి ‘మజిలీ’ ఏస్థాయిలో హిట్ ఉంటుంది అన్నది తెలుస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: