బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎంత పాపులారిటీ ఉందో అంతే రేంజ్ లో వివాదాలు కూడా ఉన్నాయి. హిట్ అండ్ రన్ కేసు, కృష్ణ జింక కేసు కొంత కాలం నీడలా వెన్నంటిన విషయం తెలిసిందే.  హీరోయిన్ల పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తారని ఆరోపణలు కూడా ఉన్నాయి.  తాజాగా సల్మాన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు.  ప్రస్తుతం ఆయన ప్రభుదేవ దర్శకత్వంలో ‘దబాంగ్ 3’ సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ లో భాగంగా   మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ సెట్టింగ్ వేశారు. 


అయితే సల్మాన్ ఖాన్ పుట్టి పెరిగింది కూడా ఇండోర్ లోనే..కావడం ఆయన సెంటిమెంట్ దృష్ట్యా షూటింగ్ అక్కడ నుంచి ప్రారంభించేందుకు ప్లాన్ చేశారు.  ఇక్కడే చిత్ర యూనిట్ పెద్ద తప్పు చేసిందని వార్తలు వస్తున్నాయి.  మహేశ్వర్ ప్రాంతంలో నర్మదా నది తీరాన చిత్ర బృందం ఓ సెట్ ను నిర్మించింది. ఆ సెట్ లో చెక్కల కింద శివలింగం ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్త కాస్త దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. దాంతో హిందువులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు.  


రాజకీయంగా కూడా ఈ సంఘటన దుమారం రేపడంతో స్వయంగా సల్మాన్ ఖాన్ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు.  అయితే శివలింగంపైన చెక్కలు పెట్టలేదని, షూటింగ్ పూర్తయ్యే వరకు అది పాడవకుండా తామే అలా దాచామని తెలిపారు.  షూటింగ్ పూర్తి కాగానే యధా స్థానంలో వాటిని ఉంచుతామని హామీ ఇచ్చారు.  మరి ఈ వివాదం పెద్దగా అవుతుందా..ఇక్కడితో ఆగిపోతుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: