ఒకప్పుడు సినిమాల్లో ఎంతో కష్టపడి హీరో తన ప్రేమని సాధించడమే సినిమా కథ.. హీరో హీరోయిన్ పెళ్లితో కథ ముగుస్తుంది. కాని యువ దర్శకులు వచ్చాక సినిమా కథలు కూడా మారాయి. పెళ్లి తర్వాత కథలతో సినిమాలు వస్తున్నాయి. అంతేనా ప్రేమించింది ఒకరిని పెళ్లి చేసుకునేది ఇంకొకరిని ఇలాంటి కథలు వచ్చాయి.  


అలాంటి వాటిలో ఈరోజు రిలీజైన సినిమా కూడా ఒకటి అదే మజిలీ. నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఈ సినిమా కథ అంత గొప్పగా ఉండదు. కాని ఎమోషన్ మాత్రం చాలా ఉంది. హీరో హీరోయిన్ ను ప్రేమించడం ఆమె దూరమవడం మరో హీరోయిన్ తో పెళ్లడం.. అంతేనా హీరో మొదటి ప్రేయసిని మర్చిపోలేక ఉన్నా సరే అతని భార్య అతన్ని ప్రేమగా చూడటం.


తెలుగు సినిమాలు మారాయి.. తెలుగు ప్రేక్షకులు మారారు అన్న దానికి మజిలీ సినిమా ఓ ఉదహరణ అని చెప్పొచ్చు. ఎప్పుడు రొటీన్ మాస్ ఫార్ములా సినిమాలే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసే సినిమాలకు ప్రేక్షకుల అండ ఎప్పుడూ ఉంటుంది. రియల్ లైఫ్ భార్యా భర్తలైన నాగ చైతన్య, సమంతలు పెళ్లి తర్వాత స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సినిమాకు వారి జంట కూడా చాలా ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు.


సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువే కాబట్టి నాగ చైతన్య మజిలీ సేఫ్ ప్రాజెక్ట్ అయినట్టే. ఎలాగు మొదటి షో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి రేపు ఉగాది, ఆ తర్వాత వీకెండ్ నాడే ఈ సినిమా పెద్ద విజయాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంది. మరి ఇలాంటి సినిమాలను ఆదరిస్తేనే మళ్లీ ఇలాంటి ప్రయోగాలు చేయాలని దర్శకులకు ఉంటుంది. లవ్ అండ్ ఎమోషనల్ జర్నీగా సాగిన మజిలీ ఉగాదికి అక్కినేని ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: