మెగా బ్రదర్ నాగబాబు తన తమ్ముడు పవన్ కళ్యాన్ స్థాపించి జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే.  మొన్నటి వరకు యూట్యూబ్ ఛానల్ లో తనదైన మాటల తూటాలతో సోషల్ మీడియాలో తెగ హంగామా చేసిన నాగబాబు ఇప్పుడు పార్టీ ప్రచారాల్లో మునిగిపోయారు.  ఆయనకు మద్దతుగా మెగా హీరోలు అల్లు అర్జున్, వరుణ్ తేజ్ లు వస్తున్న విషయం తెలిసిందే.  


 ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చాయంటే.. అందరిచూపు ఉభయగోదావరి జిల్లాలవైపే. ఉభయగోదావరి జిల్లాలో అత్యధిక సీట్లు ఎవరు గెలిస్తే వారిదే అధికారం అన్నది ఓ సెంట్ మెంట్. ఈసారి ఎన్నికల్లో మరో ప్రత్యేకత ఉంది..నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున మెగాస్టార్ చిరంజీవి సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు ఇప్పటికే నరసాపురం పార్లమెంట్ ను చుట్టేస్తున్నారు. మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గం లో ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు.

ఇప్పుడు బుల్లితెర, వెండితెర తారలు నాగబాబు, పవన్ కళ్యాణ్ లను గెలిపించాలంటూ  రంగంలోకి దిగారు.  గత కొంత కాలంగా నాగబాబు,రోజా జబర్ధస్త్ కామెడీ షోలో జడ్జీలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో జబర్ధస్త్  ఫేమ్ లు చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, దొరబాబు, రాజు, రాఘవ, రామ్ ప్రసాద్ వంటి నటులు సైతం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరిగి జనసేన పార్టీ కరపత్రాలను పంచుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: