ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ సినీరంగంలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో మరో హీరోయిన్ తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవం బయటపెట్టింది. దాన్ని తాను ఎలా ఎదుర్కొన్నదీ వివరించిందీ ముద్దుగుమ్మ.. 


ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటారా.. శృతి మరాఠే.. ఈపేరు ఎక్కడా వినలేదంటారా.. మన తెలుగులో లేదు కానీ.. బాలీవుడ్ తో పాటు తమిళం మరియు కన్నడంలో నటించింది. 16 ఏళ్ల వయసులోనే బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ అమ్మడికి అదృష్టం కొద్ది అవకాశాలు బాగానే వచ్చాయట.

కానీ...  కెరీర్ ఆరంభంలో ఇబ్బందులు ఎదుర్కొందట. ఇక ఒక దర్శకుడు సినిమాలో ఆఫర్ ఇచ్చి.. నాతో ఒక రాత్రికి వస్తావా ఈ సినిమాలో నీవే హీరోయిన్ అన్నాడట. అప్పుడు శ్రుతి ఏమందో తెలుసా... అతనికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. 

నేను నీదగ్గర పడకుంటే..  మరి హీరో వద్దకు ఎవరిని పంపిస్తున్నావు అని కౌంటర్ ఇచ్చిందట. అంతే ఆ ప్రాజెక్టు నుంచి ఆమెను తీసేశారట. అయినా తాను బాధపడలేదంటోంది శ్రుతి. ఈ ఆవేదనను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. 

ఆమె పోస్ట్ కు సోషల్ మీడియాలో మాంచి రెస్పాన్స్ వచ్చింది.  జరిగిన అన్యాయంను ధైర్యంగా చెప్పుకునేందుకు వచ్చిన శృతిని అభినందిస్తున్నారు. బాలీవుడ్ తో పాటు అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో కూడా కాస్టింగ్ కౌచ్ లైంగిక వేదింపులు ఉన్నాయంటున్న శ్రుతి హీరోయిన్లు జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: