అక్కినేని నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్ హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మజిలీ’ శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‌లోనూ పలుచోట్ల విడుదలైంది. పెళ్లైన తర్వాత మొదటి సారిగా ఈ జంట నటించడంతో సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలే మొదలయ్యాయి. అనుకున్నట్లే ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.  అందులోనూ ఈ మద్య  థియేటర్ లో సరైన సినిమాలు లేక బోర్ ఫీలింగ్ లో ఉన్న ఆడియన్స్ కి ఈ సినిమా మంచి రిలీఫ్ ఇస్తోంది.


ఈ సినిమాలో నాగచైతన్య రెండు విభిన్నమైన గెటప్స్‌ మరియు వేరియేషన్స్‌తో  కనిపించాడు.  ఇక సమంత  ఈ మూవీకి ఆకర్షణగా నిలిచారు. ఒక మెచ్యూర్డ్‌ కథతో ఈ మూవీ రూపొందించిన దర్శకుడు శివ నిర్వాన విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రీమియర్ షోల ద్వారా 135,171 డాలర్లు (సుమారు రూ.93.54 లక్షలు) వసూలైనట్లు తెలుస్తోంది. గతంలో ‘సవ్యసాచి’ సినిమాకు ప్రీమియర్ షోల ద్వారా యూఎస్ బాక్సాఫీసు వద్ద 111,706 డాలర్లు వసూలయ్యాయి.  

నాగచైతన్య కెరీర్‌లోనే యూఎస్ ప్రీమియర్ల ద్వారా ఇంత పెద్ద మొత్తంలో వసూలు కావడం ఇదే తొలిసారి.  ఆయన కెరీర్‌లో ఇది చాలా ప్రత్యేకమైన సినిమాగా చెబుతున్నారు. ఉగాది కావడం, పైగా వీకెండ్ దీంతో జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. మొదటి రోజు మార్నింగ్ షో సినిమాకు వచ్చిన టాక్ చూసిన బయ్యర్లు వెంటనే థియేటర్ల సంఖ్య పెంచేశారు. ఈ దూకుడు చూస్తుంటే ఈ సినిమా మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యేలా ఉంది. మొత్తానికి ఈ సినిమాతో నిర్మాతలు బాగా లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.   


ఏరియావైజ్ కలెక్షన్లు : 

నైజాం : 1.94 కోట్లు

వైజాగ్‌ : 76 లక్షలు

ఈస్ట్‌ : 28 లక్షలు

వెస్ట్‌ : 27 లక్షలు

కృష్ణ : 37 లక్షలు

గుంటూరు : 67 లక్షలు

నెల్లూరు : 18 లక్షలు

సీడెడ్‌ : 75 లక్షలు

యూఎస్‌ : 88 లక్షలు

కర్ణాటక : 73 లక్షలు

ఇతరం : 25 లక్షలు

మొత్తం : 7.00


మరింత సమాచారం తెలుసుకోండి: