టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగించాలని నడుం కట్టిన విక్టరీ వెంకటేష్ మళ్లీ మరో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈసారి తన మేనళ్లుడు నాగ చైతన్యతో వెంకటేష్ సినిమా చేస్తున్నాడు. వెంకీమామ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. జై లవ కుశ తర్వాత బాబి డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది.


సినిమాలో కూడా నిజంగానే వెంకటేష్, నాగ చైతన్యలు మామా అల్లుళ్లుగా నటిస్తున్నారు. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ లో వడ్ల బస్తాల మీద మామా అల్లుళ్లు అదేనండి నాగ చైతన్య, వెంకటేష్ కూర్చున్న పోస్టర్ వదిలారు. తెలుగు సంవత్సరాది ఈ ఉగాది రోజున ఆ పండుగ జోష్ మరిత పెంచేలా వెంకీమామ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది.


కొన్నాళ్లుగా కమర్షియల్ సక్సెస్ కు వెంకపడి ఉన్న వెంకటేష్ ఎఫ్-2 సినిమాతో దుమ్ముదులిపేశాడు. ఇక మజిలీ సినిమాతో నాగ చైతన్య కూడా హిట్ అందుకున్నాడని తెలుస్తుంది. మొత్తానికి సూపర్ హిట్ సినిమా తర్వాత వెంకటేష్, నాగ చైతన్య ఇద్దరు క్రేజీ స్టార్స్ వెంకీమామ సినిమా చేస్తున్నారు. 


సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకీ, చైతుల స్క్రీన్ ప్రెజెన్స్ అందరిని అలరిస్తుందని అంటున్నారు. ఈ సంక్రాంతికి ఎఫ్-2తో సెన్సేషనల్ హిట్ అందుకున్న వెంకటేష్ 2020 సంక్రాంతికి వెంకీమామతో వచ్చేలా ఉన్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ నాగ చైతన్య ప్రేమం సినిమాలో వెంకీ ఓ చిన్న కెమియో రోల్ చేశాడు. ఇక ఇప్పుడు ఇద్దరు కలిసి ఫుల్ సినిమా చేస్తున్నారు అది ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: