టాలీవుడ్ లోనే కాదు జాతీయ స్థాయిలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘బాహుబలిః ది కంక్లూజన్’రికార్డుల మోత మోగించింది.  భారత దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది.  ఈ నెల 28వ తేదీతో ‘బాహుబలిః ది కంక్లూజన్’విడుదలై రెండేళ్లు పూర్తవుతుంది.   ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సంవత్సరం గ్యాప్ తీసుకొని  ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు.   ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి..దాంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడంతో  షూటింగ్ ఎక్కువ సమయం పడుతోంది. 

 ‘బాహుబలి’ తర్వాత ఆ రేంజ్‌కు తగ్గకుండా ఉండే సినిమాను ప్రేక్షకులు ప్రభాస్ నుండి ఆశిస్తారనే ఉద్దేశంతో యువి క్రియేషన్స్ వారు ఏవిధంగానూ రాజీ పడకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘సాహో’ మూవీ  తెలుగు, హిందీతో పాటు కొన్ని ఇతర భారతీయ భాషల్లో ఆగస్టు 15వ తేదీన ఒకేసారి విడుదల చేయనున్నారు. టి సిరీస్ వారు హిందీ వర్షన్ థియేట్రికల్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకున్నారు.   

బాహుబలి తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడతో..ప్రభాస్‌కు జపాన్‌లో భారీగా ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే జపాన్‌లో ఉన్న ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ‘సాహో’ రైట్స్‌ను భారీ రేటుకు సొంతం చేసుకున్నారు. జపాన్‌లోని అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా జపాన్‌లో భారీ ప్రమోషన్స్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగా టోక్యోలో జరిగే ప్రమోషనల్ ఈవెంట్‌కు ప్రభాస్ స్వయంగా హాజరవుతారని ఫిలిమ్ వర్గాల టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: