ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి నడుస్తుంది.  గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అనే విధంగా తలపడుతున్నాయి.  ప్రచారాలు ముమ్మరమవుతున్నాయి. ప్రత్యర్థులపై తమ పదునైన మాటలతో విరుచుకుపడుతున్నారు.  మరోవైపు వైసీపీ, టీడిపి తమ మేనిఫెస్టో లు విడుదల చేశాయి. 

ఇటీవల రాంగోపాల్ వర్మ నిర్మించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏపిలో విడుదల కాకుండా అడ్డుకున్నారు కొందరు. ఇప్పుడు టివిలో వైఎస్సార్ యాత్ర మూవీ ప్రసారం కాకుండా మరో అడ్డు పుల్ల వేశారు.  ఈ నేపథ్యంలో సినిమాను అడ్డుకోవాలని టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదును ఈసీ తోసిపుచ్చింది.  స్టార్ మా ఛానల్ లో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానున్న యాత్ర చిత్రం ఎన్నికల నియమావళిని ఏ రకంగానూ ఉల్లంఘించడం లేదని స్పష్టం చేసింది.

టీడీపీ నేతల ఫిర్యాదును తమ మీడియా సర్టిఫికేషన్ కమిటీ పరిశీలించిందనీ, అందులో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే అంశాలేవీ లేవని తేల్చిచెప్పింది. ఈ మేరకు టీడీపీ నేతల ఫిర్యాదుకు ఈసీ జవాబు ఇచ్చింది. ఈ మేరకు టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యకు ఈసీ లేఖ రాసిన విషయం తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: