సూపర్ స్టార్ మహేష్ ని చూసిన దర్శకుడు రాఘవేంద్రరావు క్రిష్ణతో అన్నారట.మీ వాడు తెలుగు హీరో కాదు హాలీవుడ్ స్టార్ అవుతాడు. అంతటి అందగాడు, టాలెంటెడ్ యాక్టర్ అంటూ దర్శకేంద్రుడు మహేష్ గురించి ఆయన తండ్రితోనే గొప్పగా చెప్పారట. అన్నట్లు మహేష్ ఫస్ట్ మూవీ దర్శకుడు రాఘవేంద్రరావు తీసిందే. రాజకుమారుడు వచ్చి ఇప్పటికి రెండు దశాబ్దాలు దాటినా మహేష్ అందం మాత్రం ఎక్కడా తగ్గలేదు సరికదా పెరిగిపోతోంది.


సూపర్ స్టార్ గా మహేష్ స్టామినా ఏంటో టాలీవుడ్ లో  అందరికీ తెలుసు. మహేష్ ఛరిష్మా అంటే ఒక్క తెలుగు ప్రేక్షకులకే కాదు కోలీవుడ్, సౌత్, అటు బాలీవుడ్ జనాలకు ఆసక్తి ఎక్కువ. నిజానికి బాలీవుడ్లో హీరోగా చేసే క్వాలిటీస్ అన్ని మహేష్  లో ఉన్నాయి. కానీ ఎందుకో ఆయన ఫోకస్ మాత్రం బాలీవుడ్  పై  పడలేదు. మహేష్ బాలీవుడ్ ఎంట్రీ కోసం పలుమార్లు ప్రయత్నాలు కూడా జరిగాయి కానీ అవి వర్కవుట్ కాలేదు. తాజాగా మహేష్ నెక్స్ట్ సినిమా బాలీవుడ్లో వుంటుందంటూ తెగ ప్రచారం జరుగుతోంది.



మహేష్ ప్రస్తుతం మహర్షి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.దాదాపు షూటింగ్ పూర్తికావచ్చిన ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మహేష్ నెక్స్ట్ సినిమా బాలీవుడ్లో వుంటుందంటున్నారు సినీ వర్గాలు. తాజాగా ఈవిషయంపై మహేష్ స్పందిస్తూ చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. నేను బాలీవుడ్కి వెళతానని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు సౌత్ సినిమాలే భారీగా తెరకెక్కుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.


ఒక అద్భుతమైన కథ చేసేటప్పుడు అమేజింగ్  గా  అనిపించే సినిమా అయితే అది పాన్ ఇండియా సినిమాగా సత్తా చాటుతుంది. రాజమౌళీ అందుకు దారి చూపించారు. నా ప్యాషన్ సౌత్ వరకే.. సౌత్ సినిమాల్లోనే నటిస్తా అంటూనే ఇక్కడ ఇంకా బెటర్ సినిమాలు చేయాలి అన్నారు. మొత్తానికి మహేష్కి బాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తిలేదన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి మన మహేష్ హాలీవుడ్ రేంజి  హీరో అని ప్రశంసలు దక్కినా ఆయన మాత్రం తాను బాలీవుడ్ కి కూడా వెళ్ళనని గట్టిగా ఫిక్స్ అయిపోయారంతే.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: