మెగాస్టార్ చిరంజీవి వారసులుగా ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.  వీరిలో మంచి పాపులారిటీ సంపాదించిన హీరోలు పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, రాంచరణ్.   రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ‘గంగోత్రి’సినిమాతో హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్ వరుస విజయాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.  ముఖ్యంగా మాస్ ఇమేజ్ బాగా సంపాదించాడు.  ఆ మద్య పవన్ కళ్యాన్ గురించి నే చెప్పను బ్రదర్ అని సంచలనం రేపాడు.  ఆ తర్వాత కూడా పలు ఈవేంట్స్ లో ఇలాంటి సమాధానమే ఇచ్చాడు.  దాంతో పవన్ వర్సెస్ బన్నికి మద్య ఏదో జరుగుతుందని వార్తలు రావడంతో తమ మద్య ఎలాంటి గొడవలు లేవని..ఇటీవల ఫిలిమ్ ఛాంబర్ లో మామ పవన్ కళ్యాన్ కి మద్దతుగా వచ్చాడు. 

నాపేరు సూర్య ఈవెంట్ కి కూడా పవన్ రావడంతో మెగా ఫ్యామిలీ హీరోల మద్య ఎలాంటి గొడవలు లేవని తేలిపోయింది.  ఇక జనసేన పార్టీ తరపున నాగబాబు నరసాపురం పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. అన్న నాగబాబు గెలుపు కోసం జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.  పవన్ కళ్యాన్, నాగబాబు కి మద్దతుగా మెగా హీరోలు వస్తారని భావించారు ఫ్యాన్స్.  అయితే రాంచరణ్ కి గాయం కారణంగా రాలేక పోతున్నాడు.  వరుణ్ తేజ్ ప్రచారంలో పాల్గొంటున్నాడు.

  ఇక అల్లు అర్జున్ వస్తారని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో  టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ జనసేనకు మద్దతు పలుకుతూ అధికారిక లేఖను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ - నాగబాబు రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ తన అభిప్రాయాన్ని వివరించారు.   మంచి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన నాగబాబు గారికి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

మీరు ఏపీలో రాజకీయ అరంగేట్రం చేసి, తప్పకుండా రాష్ట్రం అభివృద్దికి తోడ్పాటు అందిస్తారని నమ్మకం ఉందని లేఖలో పేర్కొన్నాడు. మొన్నటి వరకు వస్తానంటూ చెప్పిన అల్లు అర్జున్‌ ఇప్పుడు మాత్రం ఏవో కారణాలు చెబుతూ ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపక పోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందడమే కాదు..అసలు బన్ని ఇలా ఎందుకు చేస్తున్నాడా అన్న ఆలోచనలో ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: