ఈ మద్య పాత సినిమా టైటిల్స్ తో వస్తున్న సినిమాలకు బాగా గిరాకి పెరిగిపోతుంది.  ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన రాక్షసుడు సినిమా టైటిల్ తో బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్నాడు.  తాజాగా నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ ‘బంగారు బుల్లోడు’ టైటిల్‌తో హీరో అల్లరి నరేష్ అలరించబోతున్నారు. అల్లరి నరేష్ నటిస్తోన్న 55వ మూవీకి ‘బంగారు బుల్లోడు’ అనే టైటిల్‌ను ఖారారు చేయడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.  ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

నేడు ఉగాది పర్వదినం కావడంతో కొత్త సినిమాల టైటిల్ పోస్టర్లు రిలీజ్ చేశారు. పోస్టర్‌లో నరేష్ లుక్ ఆసక్తికరంగా ఉంది. మెడలో బంగారంతో ఈ అల్లరి బుల్లోడు మెరిసిపోతున్నాడు. ఈ సినిమాలో పూజా జవేరి హీరోయిన్‌గా నటిస్తోంది.  సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.  ఈ సినిమాకు  సాయి కార్తీక్ సంగీతం  అందిస్తున్నారు.

అల్లరి నరేష్, పూజా జవేరితో పాటు తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్, వెన్నెలకిషోర్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, జబర్దస్త్ మహేష్, అనంత్, భద్రం, అజయ్ ఘోష్, సారిక రామచంద్రరావు, రమాప్రభ, రజిత, శ్యామల ఈ మూవీలో నటిస్తున్నారు. వెలిగొండ శ్రీనివాస్ మాటలు రాసిన ఈ సినిమాకి రామజోగయ్య శాస్త్రి పాటలకు సాహిత్యం అందించారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ప్రొడ్యూసర్: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.వి.గిరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: