ప్రతి జీవితానికి ఓ కథ ఉంటుంది.. ప్రతీ జీవితానికి ఓ జర్నీ ఉంటుంది.. ఎవ్రీ లైఫ్ యాస్ ఏ స్టోరీ.. ఎవ్రీ లైఫ్ యాస్ ఏ జర్నీ.. మహర్షి సినిమా రిషి అనే క్యారక్టర్ యొక్క జర్నీ. అందుకే ఆగష్టు 9 వదిలిన చిన్న ఫస్ట్ లుక్ టీజర్ లో రిషి అనే క్యారక్టర్ ను ప్రొజెక్ట్ చేశాం. ఈ సినిమాలో మీ జీవితం.. మీ పక్క వాళ్ల జీవితం.. మీ కుటుంబం ఉంటుందని అన్నారు మహర్షి డైరక్టర్ వంశీ పైడిపల్లి.   


మహర్షి కథ ప్రతి ఒక్కరి కథ. సినిమా చూశాక ఫ్రెండ్ షిప్ కొందరు.. ఫ్యామిలీ రిలేషన్ షిప్ కు కొందరు.. లవ్ కు కొందరు ఇలా సినిమాలో అన్ని అంశాలకు ఆడియెన్స్ కనెక్ట్ అవుతారని అన్నారు. ఊపిరి తర్వాత ఎలాంటి సినిమా చేయాలనుకున్నానో అదే మహర్షి అని అన్నారు వంశీ పైడిపల్లి.


అన్ని అంశాలతో పాటుగా సూపర్ స్టార్ మహేష్ ఉన్నారు కాబట్టి కమర్షియాలిటీ విషయంలో ఎక్కడ తగ్గకుండా సినిమా చేశామని అన్నారు. మహేష్ 25వ సినిమా అనుకుని ఈ సినిమా చేయలేదు కాని మహేష్ ఫ్యాన్స్ కు చెబుతున్నా ఈ సినిమా ఆయన కెరియర్ లోనే కాదు తన కెరియర్ లో నిర్మాతలు దిల్ రాజు, అశ్వనిదత్, పివిపిల కెరియర్ లో ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందని చెప్పారు వంశీ పైడిపల్లి.    


ఇక మహర్షి నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు కూడా ఇది తప్పకుండా ఓ ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందని కథ ఎక్సైటింగ్ అనిపించే సోలోగా సినిమాలు తీసే తను పార్ట్ నర్ షిప్ లో సినిమా చేశానని. వంశీ చెప్పిన కథ కన్నా 10 రెట్లు ఎక్కువగా సినిమా చేశాడని అన్నారు దిల్ రాజు. మహేష్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు తెలుగు సిని ప్రేక్షకులందరికి ఈ సినిమా నచ్చుతుందని అన్నారు దిల్ రాజు. 


మరింత సమాచారం తెలుసుకోండి: