లాస్ట్ ఇయర్ కోలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 96. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. స్కూల్ టైంలో ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికులు పాతికేళ్ల తర్వాత కలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో ఎంతో అందంగా చూపించారు దర్శకుడు ప్రేమ్ కుమార్. 


తమిళంలో హిట్ అవగానే ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా చాలా వరకు చూశారు. అక్కడ సూపర్ హిట్టైన 96ను తెలుగు రీమేక్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. మాత్రుక దర్శకుడు ప్రేం కుమార్ తెలుగు వర్షన్ ను డైరెక్ట్ చేస్తున్నారు. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమా ఉగాది రోజున మొదలుపెట్టారు.


96 సినిమాకు వసంత్ గోవింద్ అందించిన సంగీతం చాలా ప్లస్ అయ్యింది. తెలుగులో కూడా ఆయనే సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే విజయ్, త్రిష లాగా శర్వానంద్, సమంత ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తారు అన్నది చూడాలి. దిల్ రాజు మాత్రం ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అవడం పక్కా అంటున్నారు.


ఈమధ్య నిర్మాతగా సూపర్ స్పీడ్ మీద ఉన్న దిల్ రాజు ఓ పక్క మహేష్ మహర్షి పార్ట్ నర్ షిప్ లో చేస్తున్నా ప్రెస్ మీట్ లకు ప్రమోషన్స్ కు ఆయనే కనిపిస్తున్నాడు. మహర్షి తర్వాత మహేష్, అనీల్ రావిపుడి కాంబినేషన్ లో సినిమాను దిల్ రాజు నిర్మిస్తాడని తెలుస్తుంది. మొత్తానికి దిల్ రాజు మళ్లీ ఫాంలోకి వచ్చాడని చెప్పొచ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి: