ఒక ప్రముఖ డాక్టర్ యాక్టర్ గా రైటర్ గా కూడ అన్నిటికన్నా మించి హాస్య ప్రియుడుగా పేరు తెచ్చుకోవడం సాధ్యమయ్యే పనికాదు. చిన్న తనంలో తన తల్లి తండ్రుల పేదరికం వల్ల తమ ఇంటిలో ట్యూబ్ లైట్లు పెట్టుకోవడానికి కూడ శక్తి లేకపోతే కేవలం తన ఇంటిలో ఉంటే 40 క్యాండిల్ బల్బు మధ్య స్వయం కృషితో చదువుకుని డాక్టర్ అయి ఈరోజు 50 వేల మోకాళ్ళ ఆపరేషన్ నులు చేసి రికార్డు క్రియేట్ చేసిన డాక్టర్ గురువారెడ్డి పై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 

తనకు సాహిత్యం పట్ల కవితల పట్ల సినిమాల ఉన్న ఇష్టంతో తనకు తానుగా యూట్యుబ్ లో ఒక ఛానల్ పెట్టుకుని పాపులర్ అయిన గురువారెడ్డి తనకు సినిమాల పట్ల ఉండే అభిమానంతో అప్పుడప్పుడు తన ఇంటిలో తన భార్యతో కలిసి డాన్స్ చేస్తూ ఉంటాడట. ఈ సరదాను చూసిన గురువారెడ్డి కొడుకు ఆదర్ష్ తన తండ్రి డాన్స్ ను షూట్ చేసి అది వాట్సాప్ లో పట్టడంతో అది కొద్ది రోజుల క్రితం వైరల్ అయింది. 

అయితే ఈ వైరల్ అయిన వీడియోను ఏకంగా పవన్ కళ్యాణ్ చూడటమే కాకుండా ఆమధ్య ఒక పెళ్ళిలో తనకు పవన్ ఎదురుపడినప్పుడు తనను పలకరించి ‘ఏమిటి సార్ మా పొట్ట దగ్గర కూడను తీసేస్తున్నారు’ అంటూ కామెంట్ చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నారు గురువారెడ్డి. ఇన్ని విషయాలలో ప్రవేశం ఉన్న గురువారెడ్డికి వంటలు వండడం ఇష్టమే కాకుండా తన దగ్గరకు వచ్చే పెషంట్లు ఇచ్చే పూతరేకులు సున్నుండలు జున్ను అంటే ప్రాణం అన్న విషయం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. 

సినిమాలు అంటే చాల ఇష్టం అని చెప్పే గురువారెడ్డి తాను పవన్ కళ్యాణ్ సినిమాలను ఇష్టపడతాను అంటూ పవన్ అభిమానులకు జోష్ ను ఇచ్చే న్యూస్ ను లీక్ చేసాడు. మనసు పై స్వాధీనం ఉంటే జబ్బులు రావని వంద రకాల భయాలు అపోహలు యూట్యూబ్ లో వీడియోలు చూసిన వారికి ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించిన కాంప్లికేషన్స్ వస్తున్నాయి కాని పట్నం ప్రజలతో పోల్చుకుంటే ఇప్పటికీ పల్లెటూరి ప్రజలు ఆరోగ్యంగానే ఉంటున్నారు చేసిన కామెంట్స్ వైరల్ గా మారింది..



మరింత సమాచారం తెలుసుకోండి: