తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత మరో ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు.  ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రం షూటింగ్ కూడా షర వేగంగా జరుపుకుంటుంది. కాకపోతే పూనేలో షూటింగ్ మొదలు పెట్టే సమయంలో రాంచరణ్ కి జిమ్ లో కాలుకి గాయం కావడం వల్ల మూడు వారాలు వాయిదా పడింది.  ఇక ఈ చిత్రం 1920 నాటి పరిస్థితులు అద్దంపట్టేలా చూపించబోతున్నారట. 

ఈ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా..ఎన్టీఆర్ కొమురం భీమ్ గా కనిపించబోతున్నారని ఆ మద్య ఓ ప్రెస్ మీట్ లో రాజమౌళి తెలిపారు.  అయితే అల్లూరి సీతారామరాజు మరదలుగా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ నటిస్తుంది. ఈ మద్య బాలీవుడ్ నుంచి చాలా మంది హీరోయిన్లు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే బాహుబలి చిత్రం తర్వాత తెలుగు చిత్రాల మార్కెట్ కూడా నార్త్ లో గట్టిగానే పెరుగుతోంది. ఈ చిత్రంలో రాంచరణ్ సరసన నటిస్తున్న ఆలియా భట్ ఇప్పుడు తెలుగు నేర్చుకుంటోంది. 

తెలుగు చాలా గొప్ప బాషా అంటూ.. నేర్చుకోవడం కష్టమైనప్పటికీ భావాలను స్వచ్ఛంగా వ్యక్తపరచడానికి అనుకూలంగా ఉండే బాషా అని తెలిపింది.   అంతే కాదు ఈ చిత్రంలో  సొంతంగా డబ్బింగ్ చెప్పడానికి డిసైడ్ అయ్యింది.  అందుకోసం తెలుగు భాషపై పట్టు సాధించేందుకు తెగ కష్టపడుతుంది. రామ్ చరణ్ గాయం కారణంగా ఇటీవల పూణే షెడ్యూల్ ని జక్కన్న వాయిదా వేశారు. ఇక నెక్స్ట్ వీక్ ఆ షెడ్యూల్ మళ్ళీ స్టార్ట్ కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: