ఇప్పటికే మెగా అభిమానుల లో పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో అనేక సార్లు రకరకాల పోస్ట్ లు పెడుతూ వ్యతిరేకంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. చాలా ఆడియో ఫంక్షన్లలో అల్లు అర్జున్ మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలని గట్టి గట్టిగా కళ్యాణ్ అభిమానులు హడావిడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి క్రమంలో అల్లు అర్జున్ కూడా ఒకానొక సమయంలో ఇటువంటి పరిణామాలపై ఆడియో వేడుకల లోనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి.

Related image

ఇదిలా ఉండగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండి తాను స్థాపించిన జనసేన పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కి మరియు జనసేన కార్యకర్తలకు అల్లు అర్జున్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ షాక్ ఇచ్చినట్లయింది. అసలే రాజకీయాలలో వైసీపీ పార్టీ కి ఆ పార్టీ అధినేత జగన్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జనసేన పార్టీ నీ పక్కన పెట్టి...రాబోతున్న ఎన్నికలలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న శిల్పా రవి రెడ్డి కి ఆల్ ది బెస్ట్ చెప్పడం ఇప్పుడు మెగా అభిమానుల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

Image result for allu arjun pawan kalyan

అయితే శిల్ప రవి రెడ్డి తన చిన్ననాటి నుండి స్నేహితుడని రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవలో తన స్నేహితుడు పాటుపడాలని ఆశిస్తున్నట్లు అల్లు అర్జున్ హృదయపూర్వకంగా పేర్కొన్నారు. దీంతో అల్లు అర్జున్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ పవన్ కళ్యాణ్ కి షాక్ కి గురి చేసినట్లు ఉందని చాలామంది సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి చెందిన వారు అంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: