గత సంవత్సరం శర్వానంద్ కు పెద్దగా కలిసిరాలేదు. అయితే అతడి క్రేజ్ ఇంకా కొనసాగుతున్న నేపధ్యంలో అనేకమంది దర్శక నిర్మాతలు శర్వానంద్ పై సినిమాలు తీయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 

ఇలాంటి పరిస్థుతులలో భారీ అంచనాలతో ప్రారంభం అయిన తమిళ మూవీ ’96 గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఈ తమిళ రీమేక్ కథ మొత్తం 1996 బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. అయితే ఇప్పటి యూత్ కు చాలామందికి 1996 పరిస్థుతులపట్ల అవగాహన లేకపోవడంతో ఈమూవీ కథను 2000 సంవత్సరం బ్యాక్ డ్రాప్ గా మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. 
దీనికితోడు ఈమూవీలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత పాత్ర పేరు జానకి కావడంతో ‘జాను’ అన్న టైటిల్ రిజిస్టర్ చేద్దామని నిర్మాత దిల్ రాజ్ ప్రయత్నించినట్లు టాక్.
అయితే ప్రభాస్ రాథాకృష్ణల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు ‘జాన్’ అన్న పేరు పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు ఉన్న నేపధ్యంలో దిల్ రాజ్ ను శర్వానంద్ మూవీకి ‘జాను’ అనే టైటిల్ పెట్టవద్దని ప్రభాస్ నుండి దిల్ రాజ్ కు స్పష్టమైన సంకేతాలు వచ్చినట్లు టాక్. 

దీనితో నిన్న ప్రారంభం అయిన ఈమూవీ టైటిల్ విషయమై మరో ఆలోచనలు దిల్ రాజ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపద్యంలో ప్రభాస్ కోసం శర్వానంద్ త్యాగం చేయవలసిన  పరిస్థుతులు ఏర్పడ్డాయి అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఈమూవీ పై శర్వానంద్ కు మంచి అంచనాలు ఉన్న నేపధ్యంలో మరో మంచి టైటిల్ కోసం శర్వానంద్ చేస్తున్న అన్వేషణ ఎంత వరకు సక్సస్ అవుతుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: