సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా వస్తున్న మహర్షి సినిమా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమా టీజర్ నిన్న ఉగాది పండుగ సందర్భమా రిలీజ్ చేశారు. మహేష్ ఫ్యాన్స్ తో పాటుగా మిగతా సిని ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంత ఈగర్ గా ఎదురుచూస్తున్నారో ఈ సినిమా టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ ను బట్టి చూస్తే తెలుస్తుంది.  


మహేష్ మహర్షి టీజర్ శనివారం ఉదయం 9:09 లకు రిలీజైంది. అయితే ఈ టీజర్ 24 గంటల్లో 12 మిలియన్ వ్యూస్ సాధించింది. మహేష్ బాబు ఏ సినిమా టీజర్ ఇలాంటి రికార్డ్ ఇంత తక్కువ కాలంలో సాధించలేదు. ఒక్క మహేష్ మాత్రమేనా మన తెలుగు హీరోల్లో ఈ రికార్డ్ అందుకున్న మొదటి హీరో మహేష్.


మహర్షి టీజర్ తోనే రికార్డుల చెడుగుడు మొదలుపెట్టాడని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. మహర్షి సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.


దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది. మే 9న రిలీజ్ కాబోతున్న మహర్షి ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. భరత్ అనే నేను తర్వాత మహేష్ నటిస్తున్న ఈ మహర్షి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: