గత శుక్రువారం విడుదలైన ‘మజిలీ’ కి టోటల్ పాజిటివ్ టాక్ రావడంతో ఈమూవీ కలక్షన్స్ ఊహించిన స్థాయి కంటే ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. చైతన్య కెరియర్ లో హైయ్యస్ట్ కలక్షన్స్ వచ్చే మూవీగా ‘మజిలీ’ మారుతుందని ప్రాధమిక అంచనాలు వస్తున్నాయి. దీనికితోడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాని నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు ఒక్క ‘మజిలీ’ తప్ప మరే సినిమా చూడడానికి లేకపోవడంతో ఈ వారం అంతా మజిలీ హంగామా కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. 

ఇది ఇలా ఉంటే ఈమూవీ కథలో ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు శివ నిర్వాణ చేసిన పొరపాట్లను కూడ ప్రేక్షకులు పట్టించుకోకపోవడం అత్యంత ఆశ్చర్యం కలిగించింది. ఈమూవీ కథలో చైతన్య పోషించిన పూర్ణ పాత్ర తన గర్ల్ ఫ్రెండ్ తో విడిపోయినట్లు చూపించి ఆ సంఘటన జరిగి సుమారు 4-5 ఏళ్ళు అయినట్లుగా దర్శకుడు ఫ్లాష్ బ్యాక్ లో కథను నడిపించాడు. 

పూర్ణతో విడిపోయిన ఆ అమ్మాయికి 13 ఏళ్ల అమ్మాయి ఎలా ఉంటుంది అన్న సందేహం సాధారణంగా ప్రేక్షకులకు రావాలి. అయితే ఆ విషయాన్ని అసలు ప్రేక్షకులు పట్టించుకోకుండా ఈమూవీ సెకండ్ ఆఫ్ ను చూసిన పరిస్థితి విమర్శకులకు అత్యంత ఆశ్చర్యంగా మారింది. దీనికితోడు ఈసినిమా చూస్తున్న ప్రేక్షకులు అంతా సమంత చైతన్యల మాయలో పడిపోయి కేవలం పూర్ణ శ్రావణి పాత్రలను మాత్రమే చూస్తున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

దీనికితోడు ఈమూవీ కథలో మరికొన్ని చిన్నచిన్న తప్పులు కనిపించినా ‘మజిలీ’ మ్యానియాతో ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. ఈసినిమా విడుదల ముందురోజు ఈమూవీ రిజల్ట్ గురించి టెన్షన్ పడుతూ సమంత తాను ఆ రాత్రి ప్రతి గంటకు నిద్రలేచి అటుఇటు తిరుగుతూ ఈమూవీ టాక్ గురించి టెన్షన్ పడ్డాను అని స్వయంగా చెప్పిన పరిస్థుతులలో ఈమూవీ సక్సస్ చైతు సమంతలకు ఎంత కీలకంగా మారిందో అర్ధం అవుతుంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: