‘గంగోత్రి’ సినిమాతో ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ మొదట్లో మెగా అభిమానుల అండతో ఎదిగి ఆ తరువాత స్టైలిష్ స్టార్ గా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు. ఈరోజు బన్నీ పుట్టినరోజు కావడంతో అతడితో దిల్ రాజ్ తీయబోతున్న కొత్త సినిమా ప్రకటన విడుదలైంది. 

అయితే ఈమూవీ ప్రకటనకు సంబంధించిన పోస్టర్ ను వెరైటీగా డిజైన్ చేసి 'ఐకాన్‌ కనబడుట లేదు' అంటూ డిజైన్ చేసిన టైటిల్ వైరల్ గా మారింది. సాధారణంగా అల్లు అర్జున్ కు ఒక కథ చెప్పి ఒప్పించడం చాల కష్టం అని అంటారు. త్రివిక్రమ్ లాంటి చేయి తిరిగిన రచయిత బన్నీ కోసం తన స్క్రిప్ట్ విషయంలో పడ్డ పాట్లు ఓపెన్ సీక్రెట్.

అయితే పెద్దగా సక్సస్ లు లేని యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈమూవీ కథను ఒక సింగల్ సిటింగ్ లో చెప్పి బన్నీని ఒప్పించాడు అన్న ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఈమూవీ టైటిల్ చాల డిఫరెంట్ గా ఉండటంతో ఈమూవీ ప్రారంభం కాకుండానే అంచనాలు పెరిగిపోతున్నాయి. 

వాస్తవానికి ఈసినిమాను అల్లు అర్జున్ ప్రస్తుతం తాను నటిస్తున్న త్రివిక్రమ్ మూవీ తరువాత చేయబోయే సుకుమార్ మూవీ తరువాత ఉంటుంది అని అంటున్నారు. అయితే ఈమధ్య సుకుమార్ తన కథలతో టాప్ హీరోలను మెప్పించలేక పోతున్న పరిస్థుతులలో చివరి నిముషంలో బన్నీ సుకుమార్ కు హ్యాండ్ ఇచ్చి వేణు శ్రీరామ్ వైపు వెళ్ళిపోతాడా అన్న సందేహాలు కూడ కలుగుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: