మహేశ్ సత్తా ఏంటో మహర్షి టీజర్ చెప్పేస్తోంది. ఈ టీజీర్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. తొలి 24 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ వచ్చినట్టు ప్రముఖ సినీ పీఆర్వో బీఏ రాజు ట్వీట్ చేశారు. కేవలం 13 గంటల్లో కోటి వ్యూస్ వచ్చినట్టు వివరించారు. 


మహర్షి టీజర్ కు యూట్యూబ్ లో ఒక 1.2 కోట్ల వ్యూస్ వచ్చాయి.  కోటి వ్యూస్ నుంచి 1.2 కోట్ల వ్యూస్ కి చేరడానికి చాలా తక్కువ సమయం తీసుకున్న టీజర్ గా మహర్షి రికార్డు నెలకొల్పింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కరోజు వ్యవధిలో ఎక్కువమంది చూసిన టీజర్ కూడా ఇదే. 

ఈ టీజర్‌లో మహేశ్ బాబు గెటప్, స్టయిల్ కొత్తగా ఉన్నాయి. సినిమా టేకింగ్ కూడా వినూత్నంగా ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే కథానాయిక. కామెడీ హీరో అల్లరి నరేష్ ఈ చిత్రంలో మహేశ్ ఫ్రెండ్ గా నటిస్తుండడం ఆసక్తి కలిగించే అంశం.



మరింత సమాచారం తెలుసుకోండి: