ప్రియాంక. ఇండియాలో బాలీవుడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా అమెరికన్ థ్రిల్లర్ సీరీస్ క్వాంటికోతో అక్కడికి వారికి కూడా దగ్గరైంది. ఆ హాలివుడ్ పరిచయంతోనే అక్కడి నటుడు గాయకుడు నిక్‌ను ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 


అయితే.. వీరి పెళ్లి వేడుకకి సంబంధించిన విషయాలను మరిచిపోకమునుపే, ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయనీ ..  విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి కూడా వచ్చేశారనే వార్తను ఓ అమెరికన్ మ్యాగజైన్ ప్రచురించింది. ఈ సినీజంటకు ఒక్క క్షణం కూడా పడడం లేదని, ప్రతీ విషయానికి గొడవ పడుతున్నారట. 

తొందరపడి ఒక్కటైన వీరిద్దరూ ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారని ఆ పత్రిక తన కథనంలో కామెంట్ చేసింది. పెళ్లి తర్వాత ప్రియాంక స్వభావం మారుతుందని నిక్ ఫీలవుతున్నాడట. పోనీలే.. ప్రియాంక త్వరలోనే మారుతుందని నిక్ భావించాడని, కానీ ఆమె ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో నిక్ ఆవేదన చెందుతున్నాడని ఆ కథనం చెబుతోంది. 

ఈ వార్త చదివి ప్రియాంక చోప్రా అభిమానులంతా నివ్వెరపోయారు. ఆ తరువాత ఈ వార్తలో నిజం లేదనే సంగతి తెలుసుకుని తేలికగా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రియాంక చోప్రా మాత్రం తేలికగా తీసుకోవడం లేదట. సదరు అమెరికన్ మ్యాగజైన్ పై దావా వేయడానికి ఆమె సిద్ధమవుతోందని సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: