స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను సథరన్ స్టార్ గా మార్చే ప్రయత్నంలో దిల్ రాజు మరో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. బన్నితో ఆర్య, పరుగు, డిజే సినిమాలను నిర్మించిన దిల్ రాజు లేటెస్ట్ గా మరో మూవీకి సిద్ధమయ్యారు. వేణు శ్రీరాం డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది.


ఈ సినిమాకు టైటిల్ గా ఐకాన్ అని పెట్టారు ట్యాగ్ లైన్ గా కనిపించుటలేదు అని పెట్టారు. ఓ మై ఫ్రెండ్, ఎం.సి.ఏ సినిమాల తర్వాత వేణు శ్రీరాం డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ కొద్దిపాటి గ్యాప్ తో త్రివిక్రం తో సినిమాకు సిద్ధమయ్యాడు. 


ఆ సినిమా త్వరలో మొదలు కాబోతుందని తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ 20వ సినిమా అసలైతే సుకుమార్ తో ఉండాల్సింది కాని దానికంటే ముందే వేణు శ్రీరాం తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు అల్లు అర్జున్. ఐకాన్ అనే టైటిల్ తో సర్ ప్రైజ్ చేశారు. ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఐకాన్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. 


చూస్తుంటే ఈసారి అల్లు అర్జున్ యూనివర్సల్ కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ను సథరన్ స్టార్ గా మార్చేస్తున్నారు. అంటే సౌత్ మొత్తం స్టార్ అంటే ఈ ఐకాన్ సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ అవుతుందని చెప్పొచ్చు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: