మెగా స్టార్ షష్టి పూర్తి వయసు దాటేసి చాలాకాలం అవుతోంది. అయినా ఖైదీ నంబర్ 150 మూవీలో కాజల్ తో జోడీ కట్టి అదరగొట్టాడు. రత్తాలు అంటూ సాంగ్ చేసి మాస్ మసలా ఘాటు చూపించాడు. చిరు గ్రేస్, క్రేజ్ అలాగే ఉందని కూడా ప్రూవ్ చేసుకున్నాడు. మొత్తానికి చిరు అంటే మ్యాజిక్ అని చెప్పేశాడు.


ఇపుడు సైరా మూవీతో బిజీగా ఉన్న చిరు తరువాత చిత్రం సెన్షేషనల్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్న సంగతి విధితమే. ఆ మూవీ కోసం మంచి మెసేజ్ తో కధను శివ రెడీ చేశాడు. ఇక ఈ మూవీలో కమర్షియల్ వాల్యూస్ అన్నీ ఉండేలా  శివ డిజైన్ చేశాడట. ఇక ఈ మూవీ మెగా ఫ్యాన్స్ ని అలరించేందుకు మంచి డ్యాన్సులు. సాంగ్స్ కూడా ఉంటాయట.


అందుకోసం మిలీ బేబీ తమన్నాని ఒక హీరోయిన్ గా బుక్ చేశారు. తమన్నాతో చిరంజీవి కాంబినేషన్ అన్నది చాలా కాలంగా వినిపిస్తున్నదే. ఇపుడు అది వర్కౌట్ అవుతోంది. అలాగే రెండవ హీరోయిన్ గా శ్రుతి హాసన్ ని బుక్ చేశారట. ఈ ఇద్దరితో చిరు ఆడి పాడి మెగా ఫ్యాన్స్ కి కనువిందు చేస్తారట. మొత్తానికి సెట్స్ మీదకు వెళ్లక ముందే మెగా మూవీ ఇంటెరెస్టింగ్ గా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: