పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉన్న నటుడు. రాజకీయాల్లోకి వచ్చి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన పార్టీ గెలుస్తుందా అంటే ఇపుడున్న పరిస్థితుల్లో కింగ్ మేకర్ అవుతుందా, కింగ్ అవుతుందా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. పవన్ తన మటుకు తాను చాలానే రాజకీయం చేస్తూ వస్తున్నారు.


అయితే మరో వైపు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు, ఇంకో వైపు ఫార్టీ సిక్స్ యియర్స్ జగన్ పోటా పోటీగా ఉన్నారు. ఇద్దరూ రాజకీయంగా బలమైన వారే, సమ ఉజ్జీలే, రాజకీయం రెండు పార్టీల మీదనే కేంద్రీక్రుతమై ఉంటుందని అంచనాలు వస్తున్నయి. ఏపీలో ఇప్పటి వరకూ చేసిన ఏ ఒక్క సర్వే కూడా హంగ్ అన్న మాట లేకుండా ఉంది. ఇక వైసీపీ గెలుస్తుందనే సర్వేలు చెబుతున్నాయి. ఒక సర్వే అదీ ఆంధ్రజ్యోతిలో వచ్చింది మాత్రమే టీడీపీ అంటోంది. మరి ఈ సర్వేల్లో మరో విషయం ఎక్కడా జనసేనకు డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని కూడా చెప్పలేకపోతున్నాయి.


ఈ నేపధ్యంలో పవన్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మీద ఇంటెరెస్టింగ్ కధనాలు వినిపిస్తున్నాయి. ఆయన మళ్ళీ వెండి తెర మీద మెరుస్తారని న్యూస్ వస్తోంది. ఆయన గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా సినిమాలు చేస్తారని, ఆ విధంగా అటు పార్టీని ఇటు సినిమాలను బ్యాలన్స్ చేస్తారని అంటున్నారు. సో. పవన్ మళ్ళీ పవర్ స్టార్ లా మూవీస్ లో కనిపిస్తారన్న మాట.



మరింత సమాచారం తెలుసుకోండి: