మోహన్ బాబు విలక్షణ నటుడు, హీరోగా విలన్ గా అయిదు వందలకు పైగా మూవీస్ చేసిన టాలీవుడ్ లెజెండరీ యాక్టర్. ఆయన సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో ఉన్నారు. అన్న నందమూరి పార్టీ పెడితే వచ్చిన తొలి హీరో ఆయన. నాటి నుంచి చేసిన సేవలకు గాను ఆయనకు రాజ్యసభ సీటు అన్న గారు ఇచ్చారు. ఆ తరువాత చంద్రబాబు చేతిలోకి పార్టీ వచ్చాక మోహన్ బాబుకు టికెట్ ఇచ్చింది లేదు. పదవి దక్కిందీ లేదు.


ఇదిలా ఉండగా మోహన్ బాబు ఇపుడు అనూహ్యంగా వైసీపీ వైపుగా స్టాండ్ తీసుకుని విగరస్ గా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు, ఆయన చంద్రబాబు ని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారు. బాబుని పరుష పదజాలంతో దూషిస్తున్నారు. ఇది టాలీవుడ్లో బాబు భక్తులకు చాలా మందికి నచ్చడంలేదుట. చంద్రబాబు సామాజిక వర్గం వారే టాలీవుడ్లో ఎక్కువ. మోహన్ బాబు అదే సామాజిక వర్గానికి చెందినా ఆయన బాబును ఇపుడు అనరాని మాటలు అనడమే మిగిలిన వారికి మండిపోతోందట.


ఇక, మోహన్ బాబు కెరీర్ దాదాపుగా అయిపోవచ్చింది. అయితే ఆయన వారసులు మంచు మనోజ్, విష్ణు, లక్ష్మిల కెరీర్ మీద ఈ ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇప్పటికే మోహన్ బాబుని దూరంగా పెట్టేసిన వర్గం టాలీవుడ్లో ఉందిట. ఇపుడు మరింతమంది శత్రువులను మోహన్ బాబు కోరి తెచ్చుకున్నారని అంటున్నారు. వీటి మీద ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడుతూ తాను ఇలాంటివి అసలు పట్టించుకోనని చెప్పారు. ఐ డోంట్ కేర్ . నాతో ఉన్న వారు ఉంటారు, లేని వారు ఉండరంటూ కుండ బద్దలు కొట్టారు. ఇవనీ ఎలా ఉన్నా మోహన్ బాబు భావిస్తున్నట్లుగా వైసీపీ సర్కార్ వస్తే ఆయన దశ తిరిగినట్లే. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: