నిన్న పవన్ కళ్యాణ్ తన పై చేసిన మాటల దాడికి కమెడియన్ అలీ ఘాటైన సమాధానం ఇచ్చాడు. నిన్నరాత్రి మీడియాకు విడుదల చేసిన ఒక వీడియోలో అలీ పవన్ ను టార్గెట్ చేస్తూ గట్టిగానే సమాధానాలు ఇచ్చాడు. తనను పవన్ ఎప్పుడు ‘జనసేన’ లోకి రమ్మని ఆహ్వానించ లేదనీ అలాంటి పరిస్థుతులలో తాను తనంతట తానుగా ‘జనసేన’ లో చేరుతానని ఎలా అడుగుతాను అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు.

అంతేకాదు పవన్ ఎంతో సహాయం చేసానని చెపుతున్న విషయాలను అలీ వివరిస్తూ తనకు ఆర్ధికంగా సహాయం చేసాడా లేకుంటే అతడి పరపతితో తనకు ఏమైనా సహాయం చేసాడా అన్న విషయాలు చెపితే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు అస్పష్టంగా వివరాలు తెలపకుండా విమర్శలు చేయడం పవన్ లాంటి స్థాయి ఉన్న వ్యక్తికి తగదు అంటూ సున్నితమైన చురకలు అంటించాడు. 

అంతేకాదు తాను సినిమాలలో తన స్వయం కృషితో ఎదిగాను కానీ తన వెనుక ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు అలీ. అయితే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున జగన్ కోసం ప్రచారం చేస్తున్న పరిస్థుతులలో తాను ఎప్పుడు హద్దులు దాటి పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదు అన్న విషయం పవర్ స్టార్ తెలుసుకుంటే మంచిది అంటూ అలీ పవన్ కు చిన్న హెచ్చరికలు ఇచ్చాడు. 

తాను ఇప్పటికీ పవన్ స్నేహితుడునే అని అంటూ తనకు మెగా స్టార్ చిరంజీవి అంటే ఎంత గౌరవం ఉందో తనకంటే పవన్ కు బాగా తెలుసు అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు పవన్ తన పై చేసిన కామెంట్స్ తో తాను మానసికంగా చాల హర్ట్ అయ్యానని అంటూ పవన్ అంగీకరించినా లేకున్నా తాను ఎప్పటికీ పవన్ వీరాభిమానిని మాత్రమే కాకుండా ప్రియ స్నేహితుడుని అంటూ తన బాధను వ్యక్త పరిచాడు. అయితే ఎన్నికల ప్రచారం ముగింపు వేళ నాయకులు ఎవరైనా ఎలక్షన్ మేనేజ్మెంట్ గురించి ఆలోచిస్తారుకానీ ఇలా ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ విలువైన కాలాన్ని వృథా చేసుకోరు..  


మరింత సమాచారం తెలుసుకోండి: