తాజాగా ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా విశేషాలు తెలియజేశాడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మెగా కుటుంబంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల తర్వాత మెగా అభిమానుల లో మంచి పేరు తెచ్చుకున్న బన్నీ ఏప్రిల్ 8 వ తారీఖున తన పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులు చాలాచోట్ల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు.

Image result for allu arjun icon

ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజు నాడు కొత్త సినిమా విశేషాలు తెలియజేశాడు బన్నీ. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఐకాన్ అనే సినిమా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాకి కనపడుట లేదు క్యాప్షన్ గా పెట్టారు. బైక్ మీద హీరో ఎక్కడికో వెళ్తున్నట్టు దూర సంచారానికి దేని కోసమో వెతికేందుకు వెళ్తున్నట్టు దాని థీమ్ రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు.

Image result for allu arjun icon

 ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యారు..ఈ నేపథ్యంలో ఈ సినిమా అయిన వెంటనే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయబోయే కనబడుట లేదు అనే క్యాప్షన్ పెట్టిన ఐకాన్ సినిమా మొదలు అవుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. అల్లు అర్జున్ విడుదలైన చివరి సినిమా నా పేరు సూర్య దారుణంగా ఫ్లాప్ అవడంతో కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందు అడుగులు వేస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: