Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 19, 2019 | Last Updated 9:53 pm IST

Menu &Sections

Search

పవన్ కళ్యాణ్ పార్టీకి భారీ విరాళం ఇచ్చిన నితిన్..!

పవన్ కళ్యాణ్ పార్టీకి భారీ విరాళం ఇచ్చిన నితిన్..!
పవన్ కళ్యాణ్ పార్టీకి భారీ విరాళం ఇచ్చిన నితిన్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చివరాకరికి వచ్చేసరికి స్పీడ్ పెంచారు. 2014 ఎన్నికలలో జనసేన పార్టీని స్థాపించి చంద్రబాబుకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 2019 ఎన్నికలకు వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాలలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా? ఓడిపోతారా? అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది.

pawan-kalyan-janasena-nagababu-ram-charan-nithin-b

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున ప్రచారానికి ఇటీవల మెగా కుటుంబం నుండి నాగబాబు మరియు రాంచరణ్, నిహారిక, వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా సంగతి మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అనే వారిలో ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ని ఎక్కువగా ప్రేమించే హీరోలలో నితిన్ ఒకరు.

pawan-kalyan-janasena-nagababu-ram-charan-nithin-b

ఈ సందర్భంగా తన అభిమాన హీరో కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేనకు తన వంతు సాయంగా రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. ఇటీవల భీమవరంలో పవన్ కల్యాణ్ ను నితిన్, అతని తండ్రి, సినీ నిర్మాత సుధాకర్ రెడ్డి కలిశారు. డీహైడ్రేషన్ తో బాధపడుతున్న పవన్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా రూ. 25 లక్షల చెక్ ను అందించారు. తనపై ఎంతో అభిమానం చూపిన నితిన్, సుధాకర్ రెడ్డిలకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో నితిన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు.



pawan-kalyan-janasena-nagababu-ram-charan-nithin-b
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Kranthi is an independent writer and campaigner.