తెలుగు ఇండస్ట్రీలో జయం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్.  ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించిన నితిన్ హిట్..ఫ్లాపులతో ప్రమేయం లేకుండా నటిస్తున్నాడు.  హీరోగా ఇప్పటికీ తన కెరీర్ పదిహేను సంవత్సరాలకు పై మాటే.  కానీ నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం ఏదీ లేదు.  సాధారణంగా ఇండస్ట్రీలో తమ హార్డ్ కోర్ ఫ్యాన్ ఎవరు అడిగితే చాలా మంది ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి అంటుంటారు. 

కానీ నితిన్ మాత్రం తన ఆరాద్య దైవం పవన్ కళ్యాన్ అంటారు.  వీరి మద్య సాన్నిహిత్యం కూడా అదే రేంజ్ లో ఉంటుంది.  తాజాగా ఏపిలో ఎన్నికలు జరుగుతన్న నేపథ్యంలో జనసేనకు భారీ విరాళం ఇచ్చాడు నితిన్. 

డీహైడ్రేషన్ తో బాధపడుతున్న పవన్ ను  భీమవరంలో నితిన్, ఆయన తండ్రి  సినీ నిర్మాత సుధాకర్ రెడ్డి కలిశారు.  ఈ సందర్భంగా పవన్ ని పరామర్శించడంతో పాటు  రూ. 25 లక్షల చెక్ ను అందించారు. తనపై ఎంతో అభిమానం చూపిన నితిన్, సుధాకర్ రెడ్డిలకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: