వరస పరాజయాలతో సతమతమైపోతున్న సాయి ధరమ్ తేజ్ ఈవారం విడుదల కాబోతున్న 'చిత్రలహరి' మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈమూవీ సక్సస్ అత్యంత కీలకంగా మారడంతో తేజ్ తెగ టెన్షన్ పడిపోతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమా విడుదలకు సంబంధించి తేజ్ తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం పై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 

ఈసినిమా సక్సస్ కోసం తన పేరును మార్చుకున్న తేజ్ ఈమూవీ విడుదల డేట్ విషయంలో ఒక వ్యూహాత్మకన తప్పు చేసాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈసినిమా నిర్మాతలు ఈమూవీని ఉగాది రోజున విడుదల చేయాలని భావించినట్లు టాక్. 'మజిలీ' ఉగాది ముందురోజున విడుదలైతే 'చిత్రలహరి' ఆ మరుసటిరోజు ఉగాది రోజున విడుదలైతే పండుగ వాతావరణం వల్ల మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఈమూవీ నిర్మాతలు తేజ్ నచ్చచెప్పడానికి ప్రయత్నించినట్లు టాక్. 

అయితే 'మజిలీ' మూవీకి ఉన్న మ్యానియా రీత్యా ఈ సాహసం చేయడానికి మెగా మేనల్లుడు వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. అయితే 'మచిలీ' మూవీకి ఎటువంటి పోటీ లేకపోవడంతో ఉగాది పండుగ కలక్షన్స్ అన్నీ 'మజిలీ' వైపే వెళ్లిపోయాయ అలాకాకుండా 'చిత్రలహరి' పోటీగా వచ్చి ఉంటే కలక్షన్స్ ఇలా ఏకపక్షంలో 'మజిలీ' కి వచ్చి ఉండేవి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

దీనికితోడు 'చిత్రలహరి' ఎన్నికల హడావిడి అంత పూర్తి అయిన తరువాత మరుసటి రోజునే విడుదల కావడంతో ఈమూవీ గురించి పెద్దగా పట్టించుకోరు అన్న వాదన కూడ కొందరు వినిపిస్తున్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ అన్నీ తేజ్ దృష్టి వరకు వచ్చినా ఉగాది పండుగ అవకాశం చేయి జారీపోవడంతో ఎటూ తెలియని పరిస్థుతులలో అంతర్మధనంలో సాయి తేజ్ ఉన్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: