టాలీవుడ్ లో పవన్ కళ్యాన్ అంటే సినీ నటుడిగా ఎంతో అభిమానిస్తారు ఫ్యాన్స్.  అయితే ఒక నటి మాత్రం పవన్ పేరు ఎత్తితే పూనకం వచ్చిన మనిషిలా ఊగిపోతుంటారు..ఇంతకీ ఎవరా నటి అనుకుంటున్నారా.. ఆమె ఎవరో కాదు ఇటీవల కాస్టింగ్ కౌచ్ పై తిరుగుబాటు చేసి పెను సంచలనాలు సృష్టించిన శ్రీరెడ్డి.  టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకు వచ్చిన ఆమె అదే సమయంలో పవన్ కళ్యాన్ ని విమర్శించుకుంటూ మాట్లాడింది.  దాంతో ఆమె కాస్టింగ్ కౌచ్ విషయం వ్యక్తిగత విషయాలకు దారి తీస్తుందని అప్పటి వరకు మద్దతు ఇచ్చిన వారు వెనక్కి తగ్గారు. 

అప్పటి నుంచి వవన్ కళ్యాన్, జనసేనను టార్గెట్ చేసుకొని సమయం చిక్కినప్పుడల్లా తనదైన బూతు పురాణాన్ని మొదలు పెడుతుంది శ్రీరెడ్డి.  తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్.. నటుడు అలీపై సంచనల కామెంట్స్ చేశారు. అలీ తనకు స్నేహితుడైనా.. జగన్ తో చేతులో కలిపి  తనను మోసం చేశాడని అన్నారు.  అలీ కష్టాల్లో ఉన్నపుడు తాను ఎంతో సహాయపడ్డానని అన్నారు.

దానికి ఆలీ కూడా మీడియా సాక్షిగా పవన్ కళ్యాన్ కి  కౌంటర్ ఇచ్చారు.  తాజాగా సీన్ లోకి శ్రీరెడ్డి ఎంట్రీ ఇచ్చింది. సినీ పరిశ్రమలో ఎవరి అండా లేకుండా స్వయంకృషితో చిన్ననాటి నుంచి కష్టపడి ఆలీ ఈ స్థాయికి చేరుకున్నారు.  ఆయన వ్యక్తిత్వం ఎంతో గొప్పది..అలాంటి వ్యక్తి గురించి నీకు మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు.. 'అరే పవన్.. నీ స్థాయి ఏంటి..?' అంటూ బూతు పదాలు వాడింది. అంతే మరోసారి జనసేనులు శ్రీరెడ్డి ని టార్గెట్ చేసుకొని ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: