జూనియర్.. అటు ఇటు కానీ హ్రుదయంతోటి అని ఓ పాత సినిమా పాట ఉంది. దాని చక్కగా చెప్పేసారు మన సీనియర్ కమెడియన్ ఆలీ. ఆలీ నిజంగా అట్టడుగు నుంచి వచ్చిన ఆర్టిస్ట్. కేవలం 12 ఏళ్ళ వయసులో సినిమాల్లోకి వచ్చిన ఆలీ ఎన్నో ఎదురు దెబ్బలు తిని రాటు దేలారు. హీరోగా అనేక సినిమాల్లో నటించి వెండి తెర మీద కాసుల వర్షం కురిపించారు. ఆలీ తనకంటూ ఓ బ్రాండ్ వేసుకున్నారు.


వందల సినిమాలు నటించి ఆలీ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అటువటి ఆలీ ఇపుడు పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేశారు. అదీ కూడా ఫస్ట్ పవన్ నిండు సభలో అదీ, ఆలీ సొంత వూరు రాజమహేంద్రవరంలో ఘాటైన మాటలు అన్న తరువాతనే ఆలీ నోరు విప్పాల్సివచ్చింది. ఆలీకి నేనెంతో సాయం చేశాను. ఆలీని కష్టాల్లో ఆదుకున్నాను. అయినా ఆలీ నన్ను విడిచి వైసీపీలోకి వెళ్ళిపోయాడు.  ఇదీ పవన్ అన్న మాటలు


దీనికి ఆలీ రిటార్ట్ అలా ఇలా లేదు. చాలా గొప్పగా మాట్లాడాడు ఆలీ అంటున్నారు సినీ వర్గాలు. మెగా కుటుంబాంతో గొడవ ఎందుకనో, లేకపోతే ఆకాంపౌండ్ లో హీరోలు ఎక్కువ, వారితో ఎందుకనో, పోనీలే అనో చాలా మంది వదిలేస్తారు. కానీ ఆలీ అలా కాదు, తన సొంత వ్యక్తిత్వం నిరూపించుకున్నారు. తన వూళ్ళో తనని అవమానించిన పవన్ కి బాగానే కౌంటర్ ఇచ్చాడు. ఓ విధంగా పవన్ని జూనియర్ ని చేశాడు. పవన్ మీరు సినిమా పరిశ్రమకు వచ్చేటప్పటికే నేను మంచి పొజిషన్లో ఉన్నానంటూ ఆలీ ఇచ్చిన రిటార్ట్  పవన్ కి ఎక్కడ తగలాలో అక్కడే తగిలిందని  అంటున్నారు.


నిజమే పవన్ హీరో కాక ముందే ఆలీ అప్పటి ఇండస్ట్రీకి బంపర్ హిట్ లాంటి మూవీ యమలీలను హీరో అందించాడు. ఆ తరువాత కూడా అనేక మూవీస్ హీరోగా చేశాడు. అంతే కాదు. అన్ని రకాల పాత్రలు చేయగలనని ప్రూవ్ చేసుకున్న ఆర్టిస్ట్ ఆలీ. మరి అతన్ని కెలికితే మండిపోదా అందుకే జూనియర్ అని చెప్పకుండానే పవన్ని బాగా కెలికేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: