ఓ పక్క యువ హీరోలంతా వరుస హిట్లతో సత్తా చాటుతుంటే అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన యువ హీరోలు నాగ చైతన్య, అఖిల్ మాత్రం ఇంకా వెనుకపడి ఉన్నారు. అఖిల్ కెరియర్ లో చేసిన 3 సినిమాలు ఫ్లాప్ అవగా చైతు కెరియర్ కూడా అంతంత మాత్రంగానే నడుస్తుంది. అయితే ఇలాంటి టైంలో మజిలీ అంటూ ఓ క్రేజీ హిట్ కొట్టాడు నాగ చైతన్య. 


అది కూడా సమంతతో కలిసి ఈ హిట్ షేర్ చేసుకోవడం విశేషం. మజిలీ సినిమాలో పూర్ణ పాత్రలో చైతు, శ్రావణి పాత్రలో సమంత ఇద్దరు అదరగొట్టారు. ఈ సినిమా ఫలితం చైతు కెరియర్ కు ఎంత ప్రాధాన్యత అన్నది తెలిసిందే. అందుకే కరెక్ట్ టైంలో కరెక్ట్ హిట్ తో నాగ చైతన్య అదరగొట్టాడు. శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన మజిలీ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.


ఇక ఈ సినిమా నాలుగు రోజుల్లోనే లాభాల బాట పట్టింది. ఆల్రెడీ తెలుగు రెండు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కు దగ్గరయ్యిందని తెలుస్తుంది. మంగళవారం కలక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ దాటి లాభాలు వస్తాయట. ఇక మరోపక్క ఈ సినిమా మరో వారం పాటు ఇలానే నడిస్తే చైతు ఎన్నాళ్లగానో కలగంటున్న 50 కోట్ల మార్క్ కూడా రీచ్ అయ్యేలా ఉంది.


అయితే ఏప్రిల్ 12న సాయి తేజ్ చిత్రలహరి సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ఇంపాక్ట్ మజిలీ మీద పడే అవకాశం ఉంది. అది కూడా ప్రేమకథగా వస్తుంది. ఏది ఏమైనా హిట్ కోసం తపించిపోతున్న నాగ చైతన్యకు మజిలీ ఓ మెమరబుల్ హిట్ గా నిలిచింది. సినిమాలో సమంతతో పాటుగా దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటించింది. రావు రమేష్, పోసాని కృష్ణమురళి పాత్రలు కూడా బాగా అలరించాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: