సూపర్ స్టార్ మహేష్ స్టామినా ఏంటి అన్నది ఆయన హిట్ సినిమాల వసూళ్ల లెక్కలు చూస్తే తెలుస్తుంది. పోకిరిగా ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాసిన మహేష్ ఆ తర్వాత శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలతో కూడా అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. స్టార్ సినిమా అంటే టీజర్ రికార్డుల నుండి బుల్లితెర మీద వచ్చే టి.ఆర్.పి రేటింగ్స్ వరకు అభిమానులకు అవి రికార్డులే.


ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు, అశ్వని దత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. రీసెంట్ గా ఉగాది సందర్భంగా మహర్షి టీజర్ రిలీజైంది.


ఆ టీజర్ చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ సినిమా పక్కా హిట్ అంటున్నారు. మహేష్ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటే ఇక ఆ సినిమా రికార్డులను ఆపడం ఎవరి వల్లా కాదు. మరోసారి నాన్ బాహుబలి రికార్డుల మీద మహేష్ మహర్షి సినిమాతో కన్నేశాడని చెప్పొచ్చు. మే 9న రిలీజ్ అవనున్న మహేష్ మహర్షి సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.


సినిమా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు సినిమా కచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుందని సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తున్నాడు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి మహేష్ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే వరకు మరోసారి ఘట్టమనేని ఫ్యాన్స్ హంగామా షురూ అయినట్టే. మరి మహర్షి సంచలనాలు ఎలా ఉంటాయో చూడాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: