వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగార్జున తాజాగా నాగచైతన్య సమంత కలిసి నటించిన మజిలీ సినిమా సక్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గత కొంత కాలం నుండి అక్కినేని నాగార్జున నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం అలాగే నాగచైతన్య సినిమాలో కూడా ఫ్లాప్ అవ్వడం ఇదే క్రమంలో ఇప్పటిదాకా తన చిన్న కొడుకు అక్కినేని అఖిల్ కి సరైన హిట్టు పడకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న నాగార్జునకి తాజాగా విడుదలైన మజిలీ సినిమా మంచి కిక్ ఇచ్చిందని ఫిలింనగర్ టాక్.

Image result for majili

అందుకే ఇప్పుడు 'మజిలి' సక్సెస్ ను నాగ్ ఓ రేంజులో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇటీవల సమంత అండ్ చైతన్యను ఇంటికి పిలిచి డిన్నర్ చేసిన నాగ్, త్వరలోనే ఈ సినిమా యునిట్ కు గ్రాండ్ పార్టీ ఇస్తున్నాడట. అంటే తన కరువును తీర్చేసిన ఈ సినిమా యునిట్ ను ఎంత గౌరవించినా కూడా తక్కువే అని ఆయన ఫీలయ్యాడట.

Image result for majili nagarjuna

మొత్తం మీద అక్కినేని ఫ్యామిలీ కి తాజాగా వచ్చిన మజిలీ సినిమా హిట్టు చాలా సంతోషాన్ని ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదే క్రమంలో గతంలో మన్మధుడు వంటి సినిమా తో మెరిపించిన నాగార్జున సినిమా కొనసాగింపుగా చేస్తున్న మన్మధుడు పార్ట్2 కూడా హిట్ కొడితే బాగుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అక్కినేని అభిమానులు.



మరింత సమాచారం తెలుసుకోండి: