ఓ వైపు అక్కినేని, మరో వైపు మెగా ఫ్యామిలీ. టాలీవుడ్లో రెండు కుటుంబాల మధ్యన మంచి దోస్తీ ఉంది. నాగార్జున, చిరంజీవి ఇద్దరూ బెస్ట్ ఫ్రండ్స్ గా ఉంటారు. ఆ తరువాత తరంలో వారి వారసులు కూడా కలసిమెలసి ఉంటారు. ఇక కోడళ్ళు  సైతం ఎందుకు ఉండరు.


అందుకే ఇద్దరు కోడళ్ళు కలసి  ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఒక హెల్త్ ఛానెల్ నిర్వహించిన చిట్ చాట్ లో సమంత ను ఇంటర్వ్యూ చేసింది ఉపాసన. అందులో భాగంగా సమంత ను తన డైట్ గురించి కొన్ని ఫన్నీ ప్రశ్నలు అడిగింది. ఆ ఇంటర్వ్యూ ప్రోమో ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది ఉపాసన. త్వరలోనే దానికి సంబంధించిన ఫుల్ ఇంటర్వ్యూ విడుదలకానుంది.


ఇదిలా ఉండగా, స్టార్ హీరోయిన్ సమంత ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ద తీసుకుంటుందని ఆమె ట్విట్టర్ , ఇంస్టాగ్రాం ను చూస్తే తెలిసిపోతుంది. ఇక మరో వైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా ఫిట్నెస్ కు సంబంధించిన సలహాలను ,సూచనలను ఎప్పిటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వుంటుంది. మరి ఈ ఇద్దరూ కలసి చెప్పుకునే కబుర్లు చాలా ఇంటెరెస్టింగ్ గానే ఉంటాయి. ఆ ముచ్చట్లు వినాలంటే వారి ఇంటర్వూ కోసం వైట్ చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: