జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. అచ్చం చిరంజీవి బాటలోనే పయనిస్తున్నారా.. అన్న చిరంజీవి లాగానే పార్టీ పెట్టి..అన్న చిరంజీవి లాగానే అధికారం సంపాదించడంలో ఫెయిలై.. అన్న చిరంజీవి లాగానే మళ్లీ సినిమాల్లోకి వచ్చేస్తారా.. 


ఇప్పుడు సినీరంగంలో ఈ టాక్ బాగా వినిపిస్తోంది. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం చాలా నామమాత్రంగా ఉండబోతోందని అనేక సర్వేలు చెప్పాయి. జనసేన కార్యకర్తలే తమకు 20 సీట్లు వస్తే గొప్ప అన్నట్టు మాట్లాడుతున్నారు. 

అందుకే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని కొనసాగిస్తూనే సినిమాలు కూడా చేస్తాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పవన్ కి బాగా నచ్చిన దర్శకుడు, నిర్మాత కాంబినేషన్ లో సినిమా ఉంటుందని పుకార్లు షికారు కొడుతున్నాయి. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఈ వ్యవహారాన్ని చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారట.

మరో విషయం ఏమిటంటే.. పవన్ కల్యాణ్ గతంలో నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వానులు ఇవ్వలేదు. వాటిని తన ఎన్నికల అఫిడవిట్‌ లో అప్పులుగా చూపించారు. భవిష్యత్‌ లో సినిమాలు చేసే ఆలోచన వల్లే పవన్ ఆ అడ్వాన్సు ఇవ్వలేదన్న వాదన మళ్లీ ఆయన సినిమాల్లోకి వస్తారన్న వాదనకు బలమిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: