ఎన్నికల ప్రచారం పూర్తి కావడంతో ఇక అందరి దృష్టి రేపు జరగబోతున్న పోలింగ్ పై పడింది. ఇప్పటి వరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే రేపు తమకు పడవలసిన ఓట్లను జాగ్రత్తగా పోల్ చేయించుకోవడమే కాకుండా ఎక్కడా క్రాస్ ఓటింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు తాము అందుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతాయి.

ఈ పోల్ మేనేజ్మెంట్ విషయంలో ‘జనసేన’ కు పవన్ నుంచి సరైన దిశా నిర్దేశ్యం రావడం లేదు అన్న సంకేతాలు వస్తున్నాయి. వాస్తవానికి పవన్ ఎన్నికల బరిలో దిగినప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు పవన్ కూడ వ్యక్తిగతంగా తనకు కనీసం 15 సీట్లు వస్తాయని అంచనాలతో ఉన్నాడు. ఆతరువాత రంగంలోకి వచ్చిన రాజకీయ విశ్లేషకులు పవన్ ‘జనసేన’ కు 10 లోపు స్థానాలు వస్తాయి అంటూ విశ్లేషణలు ఇచ్చారు. ఇప్పుడు అన్ని ప్రముఖ సర్వేలు బయటకు వచ్చాయి. 

ఆ సర్వేలు అన్నింటిలో పవన్ కు పవన్ కు వచ్చే స్థానాలు 3 లోపే అని తేల్చి వేయడమే కాకుండా కేవలం పవన్ ఒక్కడే నెగ్గి మరి ఏ స్థానంలోను ‘జనసేన’ విజయం సాధించక పోయినా ఆశ్చర్యం లేదు అంటూ సర్వేలు చెపుతున్నాయి.  దీనితో పవన్ కు వచ్చే తన ఒక్క సీటు మాట అటుంచి పవన్ కు పడబోయే సుమారు 8-10 శాతం ఓట్లు వల్ల ఏ రాజకీయ పార్టీకి గండి పడుతుంది అన్న చర్చలు మొదలైపోయాయి. 

2014 ఎన్నికలలో పవన్ ఇచ్చిన సపోర్ట్ వల్ల తెలుగుదేశం అధికారంలోకి రాగలగింది అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే ఈ ఎన్నికలలో తాను కింగ్ మేకర్ అవుతాను అంటూ ఇప్పటి వరకు చెప్పుకొచ్చిన పవన్ తాను చీల్చపోయే ఓట్లతో జగన్ చంద్రబాబులలో ఎవరో ఒకర్ని ముఖ్యమంత్రిని చేసి పరోక్షంగా ‘కింగ్ మేకర్’ కాబోతున్నాడు. వాస్తవానికి ఇది పవన్ కోరుకునే విజయం కాకపోయినా ఓటమిలో గెలుపును చూసుకునే విధంగా పవన్ ‘జనసేన’ మారుతుందా అన్న విశ్లేషణలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: