రీసెంట్ గా అక్కినేని నాగ చైతన్య, సమంత నటించిన సినిమా మజిలీ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. నిన్నుకోరి తర్వాత మజిలీతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు డైరక్టర్ శివ నిర్వాణ.


మజిలీ సినిమా నాగ చైతన్య కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు. పూర్ణ, శ్రావణి పాత్రల్లో చైతు, సమంతలు జీవించేశారు. వారిద్దరు రియల్ లైఫ్ భార్యాభర్తలు కావడం కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఇక మజిలీతో రెండో హిట్ తన ఖాతాలో వేసుకున్న శివ ఈసారి రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తన 3వ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట.


ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడని తెలుస్తుంది. అయితే శివ నిర్వాణ విజయ్ దేవరకొండ తో చేయడం అంత ఈజీ పనేం కాదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటుగా క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ఈ రెండిటితో పాటుగా తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై డైరక్షన్ లో మరో సినిమా చేయాల్సి ఉంది.


ఇవన్ని చేశాక కాని శివ నిర్వాణతో విజయ్ సినిమా ఉంటుంది. విజయ్ తో స్టోరీ డిస్కస్ చేస్తే ఓకే అనిపించుకుంటే ఫుల్ స్క్రిప్ట్ ఎలాగు కాస్త టైం పడుతుంది కాబట్టి సినిమా చేసే ఛాన్స్ ఉంటుంది. నిన్ను కోరి, మజిలీ రెండు హిట్లతో శివ నిర్వాణ తనకంటూ ఓ బ్రాండ్ ఏర్పరచుకున్నాడు. మరి ఈ డైరక్టర్ 3వ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: